ఇంగిత జ్ఞానం
ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధితో నడుచుకోవడమే ఇంకిత జ్ఞానం
సాటి మనిషిని సంస్కారవంతంగా ప్రేమించడం ఇంగిత జ్ఞానం
అదే జ్ఞానం లోపిస్తే:-
అంతరాత్మను అనుసరించ లేకపోతారు
గందరగోళాల సృష్టిస్తారు
ఆలోచనలుపదును పెట్టలేరు
సమయాన్ని సద్వినియోగపరచలేరు
మానవత్వం మరిచిపోతారు
తప్పులను ఒప్పుకోరు
సహనాన్ని కోల్పోతారు
విమర్శనాస్త్రాలు సంధిస్తారు
అహంనీ అదుపులో ఉంచుకోలేరు
వివేకం విస్మరిస్తారు
సమయస్ఫూర్తి సవ్యంగా
ఉపయోగించరు
ఫిర్యాదుల పరంపరలు
సాగిస్తారు
దయా కరుణ మరిచిపోతారు
పెద్దలను గౌరవించరు
కనీస మర్యాదల
కరువు అవుతాయి
సామాజిక పరిస్థితులు అంచనావేయలేరు
అవగాహన లోపిస్తుంది
విచక్షణ రహితంగా వ్యవహరిస్తారు
సరియైన మానసిక వికాసంతో ఉండలేరు
జ్ఞానపరిపక్వత రానివ్వలేరు
క్రమశిక్షణారహిత్యం
పెరుగుతుంది
తెలివితేటల తేడాలున్నా కూడా ఇంగిత జ్ఞానం మనిషి వరంగా మారాలి
మనిషిలోని అరిషడ్వర్గాలు అదుపులో లేని వారికి ఇంగిత జ్ఞానంతక్కువే
నాగరిక సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషి ఇంగితజ్ఞానంతో జీవించడానికి ప్రయత్నించాలి
విద్యావంతులు సైతం గ్రంథార్జన జ్ఞానార్జనలే
కాకుండా
సమాజంలో ప్రతి ఒక్కరూ బాగుండాలి అని మంత్రం పఠించాలి?
సృష్టిలోని ప్రతి ప్రాణి శక్తివంతమైనదని గ్రహించాలి
ఈ అనంత శక్తి లో ప్రతి జీవి ఇంకొక దానిపై ఆధారపడవలసిందే
మనిషి ఆటవిక సమాజం వైపు అడుగులు
వేయకుండా ఆలోచించి
నడవడికలు నేర్చుకోవాలి
సృష్టి ధర్మంలో ప్రతి వస్తువు ప్రతి మనిషి ప్రతి జీవరాశి సమానమే అనే భావనను పెంపొందించుకోవాలి అందరూ
అదే మనిషి మనసు మాటున వేచి ఉండే అభినయం….
– జి జయ