సంగీత మహత్యం

సంగీత మహత్యం

బిడ్డ పుట్టగానే మొదలవుతుంది సంగీతం. ఆ పురిటి నొప్పులతో బాధపడేవారిలో అబ్బా అమ్మా అనే పిలిపుల్తో పాటూ బిడ్డ పుట్టగానే కెవ్వుమని ఏడుపు రాగంతో మొదలైన ఆ సంగీతం, అమ్మ జోల పాటతో మొదలై ఆ తర్వాత కూని రాగాలుగా మారి, ఉయాల్లో ఊపుతూ తనకొచ్చిన తన బామ్మలు, అమ్మలు పాడిన పాటలు గుర్తు చేసుకుంటూ వచ్చి రాని పాటలతో బిడ్డను నిద్ర పుచ్చుతుంది.

అమ్మ వెనకాల నుండి చేతులు వేసి ఉయాల ఊగుతూ అమ్మ నా చిన్నప్పుడు పాడిన ఒక పాట పాడవా అంటూ పాటలన్నీ పాడించుకుని తాను కూడా రాగం కలుపుతూ పెరుగుతుంది ఆ బిడ్డ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అలా జీవితంలో బాల్యంలో స్నేహితులతో కలిసి సినిమాలలో వచ్చిన పాటలు అన్ని పాడుకుంటూ ఉంటారు. అందరికీ సంగీతం రావాలని లేదు. వచ్చిన వారు పండితులు అవ్వాలని లేదు అని ఈ మధ్యే అంతర్జాలంలో కొందరు సంగీత కళాకారులను చూసాము.

సంగీతం ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించి అందులో మునిగి తెలి సంగీతం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టేవారు ఉన్నారు.. నేర్చుకునే స్థోమత లేని వారు వారిని చూసి నేర్చుకుని పెద్ద పాటలు పాడేవారు ఉన్నారు. ఈ సంగీతానికి పూర్వం అయితే అంట పురిటి నొప్పుల వచ్చిన వారి దగ్గర వాయిస్తే అది వింటు బిడ్డను కన్నవారు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ మధ్య కూడా చాలా దేశాలలో పెద్ద పెద్ద వ్యాధులు వచ్చిన వారికి కూడా ఆపరేషన్ మత్తు ఇవ్వకుండా సినిమాలు చూపిస్తూ, మృత్యుంజయ మంత్రాన్ని వినిపిస్తూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన ఘనత సంగితానిదే అంటే నమ్మక తప్పదు. సంగీతము అంటే ప్రతి ఒక్కరికి ప్రాణమే. పల్లెపడుచుల జానపదాలు నుండి శాస్త్రీయ సంగీతం వరకు ఆస్వాదించగలగడం మన అదృష్టం. అలాగే సంగీతంలో ఎన్నో మంచి పాటలు పాడి మనకు అందించిన మహానుభావులందరికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను..

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *