ఓ.. విశ్వ మానవా
విశ్వ మానవా…
ప్రపంచాన్ని చూస్తున్నావా…
భూకంపాలే
ప్రకంపాలే
చంపుతున్నాయి
ఇంకా…..
మన మధ్య యుద్దాలెందుకు…
బిడ్డల్ని పోగుట్టుకున్న అమ్మల్ని చూస్తే
మనసు మరిగి
మానవత్వం పెరిగి
మతాలు కొట్టుకుపోతున్నాయి
మేలుకో…. ఇప్పటికయినా….
దేవుడు మనిషిని భువి పైకి పంపిందే
ప్రేమించాడానికి…..
కలిసి మెలిసి జీవించు
ఎవరు ఎక్కువ
తక్కువ ఎవరు
అందరం ఒకటే
మాన్వాత్వాన్ని ముందుకు
తీసుకెళదాం…..
ఓ.. విశ్వ మానవా
ముందుకు వెళదాం…..
– అల్లావుద్దీన్