ఆనందమైన జీవితంలో అపశృతి
ఏమ్మా అంతా రెఢీ నా అంటూ వచ్చారు రామారావు గారు. హా అంత రెఢీ అండి ఇంకా వాళ్ళు రాలేదే అంది అనురాధ. వస్తారు లే సరిగ్గా ముహూర్తానికి వచ్చేస్తారు ఇప్పుడే ఫోన్ చేశాను దగ్గర్లోనే ఉన్నాం అన్నారు అన్నారు రామారావు గారు. ఓహ్ అవునా సరే అయితే దివ్య నువ్వు ఇంకేదైనా ఉంటే సరి చేసుకో నేను వెళ్లి టిఫిన్స్, టీ అయ్యాయా చూస్తాను అంటూ దివ్యకు చెప్పి వెళ్ళింది అనురాధ. హా సరే అమ్మ అంది దివ్య.
దివ్య, రామారావు అనురాధ దంపతుల ఒక్కగానొక్క కూతురు, కొడుకు పుట్టి చనిపోయాడు. దాంతో దివ్యనే గారాబంగా పెంచారు. దివ్య కూడా పిచ్చిపిచ్చి పెనులేమీ చేయకుండా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకుంటూ డిగ్రీ వరకు చదువుకుంది. ఇప్పుడు డిగ్రీ అయిపోగానే నీకు పెళ్లి చేస్తాము అన్నారు అందుకు కూడా దివ్య ఒప్పుకుంది ఆనందంగా. ఇప్పుడు అదే హడావుడి ఇంట్లో పెళ్లి చూపులకి మొదటిసారి వస్తున్నారు. కాబట్టి హడావుడి చాలా చేస్తున్నారు రామారావు గారు.
హడావిడిగా అటు ఇటు తిరుగుతున్న తండ్రిని చూస్తూ దివ్య ఎందుకు నాన్న అంత హడావుడి అంత టెన్షన్ దేనికి వచ్చేవాళ్ళు రాకుండా ఉండారా వాళ్లే వస్తారులే అంటూ తేలికగా చెప్పింది. నీకు తెలియదులే దివ్య మాటలు ఉంటాయి. ఒక గానొక్క కూతురివి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మాకు ఆశగా ఉంటుంది కదా అంటూ లోపల్నుంచి అనురాధ గారు నచ్చచెప్పారు.. ఆ అవును అవును అంతే అన్నారు రామారావు గారు.
ఇంతలో వాకిట్లో కారు చప్పుడు వినిపించగానే అదిగో వచ్చినట్లున్నారు నువ్వు లోపలికి వెళ్ళి దివ్య. అను నువ్వు దివ్యని తీసుకెళ్ళు పిలిచినప్పుడు పరిచయాలు అయ్యాక తనకి టీ ఇచ్చి పంపించు అంటూ చెప్పి తను హడావిడిగా వెళ్లిపోయారు. ఏంటో నాన్నగారు ఇంత హడావిడి పడుతున్నారు. నాకు లోపల వికాసభయంగానే ఉంది అయినా వారికి ధైర్యం చెప్పాలి కాబట్టి ఏదో మాట్లాడుతున్న అనుకుంది దివ్య తన మనసులో… పదా దివ్య లోపలికి వెళ్ళి కూర్చో పిలిచినప్పుడు వద్దువుగానీ అంటూ అనురాధ కూతుర్ని తీసుకొని లోపలికి వెళ్ళింది.
బయట మగవాళ్ళ మాటలు చప్పుడు పరిచయాల కార్యక్రమం అంతా దివ్యకు వినిపిస్తూనే ఉంది. అబ్బాయి ఎలా ఉంటాడో చూడాలని ఉన్నా తనను బయటకు రావద్దన్నారు కాబట్టి చూడలేక పోతుంది పైగా గరికి కిటికీలు కూడా లేవు కిటికీలోంచి చూద్దామన్న.. తనను ఆటపాటించడానికి తనకు ఫ్రెండ్స్ కూడా పెద్దగా లేరు. తనేంటో తన పనేంటో తానేంటో చూసుకునే మనస్తత్వం గల అమ్మాయి దివ్య.
తల్లిదండ్రుల మాటే వినాలని వాళ్ళు చెప్పినట్టే చేయాలని వాళ్లు ఏది చెప్పినా తన మంచి కోసమే అని ఆలోచించనగల అమ్మాయి. దివ్య ఇలా ఆలోచిస్తుండగానే అమ్మా దివ్య, అంటూ వచ్చింది అనురాధ గారు. హాయ్ ఏంటమ్మా చెప్పు అంటూ కాఫీ దివ్య చేతికిచ్చి ముందు పెద్దవారి నుంచి చిన్నవారికి ఇవ్వు ఆ తర్వాత మధ్యలో నీలం చొక్కా వేసుకున్న వ్యక్తి అబ్బాయిని చూసుకో అంటూ తల్లి చెప్పింది.. నిజానికి దివ్య అసలు ఫోటో కూడా చూడలేదు. అందువల్ల పెళ్లి కొడుకు ఎవరు అని తెలియలేదు.
తీసుకొని ముందుకు వెళ్ళింది దివ్య కొంచెం తడబాటుగా అనిపించినా తల్లి పక్కనే ఉండడంతో కాస్త ధైర్యంగా వాళ్ళ ముందుకు వెళ్లి టీలు ఇవ్వసాగింది ఒక్కొక్కరిగా టీలు ఇస్తూ నీలం రంగు చుక్క ఉన్న అబ్బాయి దగ్గరికి వచ్చింది తలెత్తి కాస్త అతన్ని చూసింది.
మరీ అంత పొడుగు కాదు మరీ అంత పొట్టి కాదు మామూలుగా ఉన్నాడు నలుపు తెలుపు కాకుండా మీడియం రంగులో ఉంటూ నవ్వుతూ టీ చేతిలోకి తీసుకున్నాడు. ఆ నవ్వుకే సిగ్గుపడిపోయిన దివ్య వెంటనే అక్కడినుంచి పక్కకి జరిగింది.
తల్లి పక్కగా వచ్చిన నిలబడిన దివ్య ను చూపిస్తూ తండ్రి మా అమ్మాయి దివ్య డిగ్రీ వరకు చదువుకుంది ఒకటే కూతురు కావడంతో కొంచెం గారాబంగానే పెంచాం అన్ని పనులు వస్తాయి అంటూ చెప్పాడు అందరికీ నమస్కారం చేసింది దివ్య.
ఇంతలో వాళ్ళలో గుసగుసలు మొదలయ్యాయి అమ్మాయి బాగుందా అంటూ, ఆ గుసగుసలు వింటున్న రామారావు గారు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకటే అమ్మాయి కాబట్టి మాకు ఉన్నవన్నీ తనకే… పెట్టిపోతలకేమి తక్కువ చేయను అంటూ చెప్పారు. అబ్బాయి తరఫున నుంచి ఒక మధ్యవర్తి లాంటి అతను లేచి అది కాదండి మీ అమ్మాయికి పెట్టిపోతలు అవన్నీ మామూలు విషయాలు కానీ మీ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది అదే మాట్లాడుకుంటున్నాం అన్నాడు.
మా అమ్మయినా మా అమ్మాయిని మీరు ఎక్కడ చూసి ఉంటారు తను ఇల్లు కాలేజీ తప్పితే ఇంక ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ చూసారు అంటూ అనుమానంగా అడిగారు రామారావు గారు. అప్పుడు పెళ్లికొడుకు లేచి నిలబడి మీరు ఏమనుకోకపోతే మీ అమ్మాయితో ఒక పది నిమిషాలు మాట్లాడొచ్చా అంటూ అడిగాడు అయ్యో దానికేం భాగ్యం బాబు వెళ్లి మాట్లాడండి అన్నారు రామారావు గారు. ఇతను నాతో ఏం మాట్లాడతాడు ఏం అడుగుతాడు అని మనసులో భయపడుతూనే పెరట్లోకి వెళ్ళింది దివ్య.
దివ్య అక్కడికి రాగానే దివ్యతో డైరెక్ట్ గా అతను చూడండి నా పేరు రమేష్ నేను సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాను అలా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళలో చాలామంది డేటింగ్ యాప్స్ చూస్తూ ఉంటారు ఎందుకంటే తమకు కావాల్సిన వాళ్ళు దొరుకుతారేమో ఫ్రెండ్షిప్ చేస్తారేమో అని అలా నా ఫ్రెండ్ చూస్తున్న సమయంలో ఒక డేటింగ్ యాప్ లో మీ ఫోటో నాకు కనిపించింది అందుకే మేము అలా అడిగాము మీరు ఏమైనా డేటింగ్ యాప్స్ యూస్ చేస్తున్నారా అంటూ అడిగాడు.
డేటింగ్ యాప్స్ అంటే ఏంటండి నాకు ఏమీ తెలియదు నేను అసలు ఫోన్ కూడా వాడను అంది దివ్య బిడియ పడుతూ, అవునా అసలు ఫోన్ కూడా వాడారా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. అవును నేను ఫోన్ ఏమి వాడను ఎందుకంటే నాకు ఇంటికి కాలేజీ దగ్గరే కాబట్టి నడిచి వెళ్లి నడిచి వస్తాను పెద్దగా ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు అని చెప్పింది దివ్య.
మరి ఆ డేటింగ్ యాప్ లో మీ ఫోటో ఎలా వచ్చింది? అంటూ అడిగాడు రమేష్, అలాగే మీరు ఎప్పుడైనా ఫోటో తీసుకున్నారా మీ ఫ్రెండ్స్ తో కానీ మీ కాలేజీలో కానీ అంటూ అడిగాడు. అవును తీసుకున్నాను కాలేజ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అంటూ చెప్పింది దివ్య.
అయితే అందులో ఎవరో ఒకరు మీ ఫోటో వాడుతూ ఆ డేటింగ్ యాప్ లో మిమ్మల్ని ఉంచారు. ఇప్పుడు ఆ డేటింగ్ యాప్ లో ఉన్న మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటే అందరూ నన్ను చెడ్డవాడు అనుకుంటారు. ఒక డేటింగ్ యాప్ లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చులకనగా చూస్తారు పైగా అది మ్యాట్రిమోనీ కూడా కాదు డేటింగ్ యాప్. అందులో ఉన్న వాళ్ళందరూ డబ్బు కోసము ఎంజాయ్ కోసము ఫోటోలు పెట్టి తమ సరదాగా తీర్చుకుంటారు అంటూ విడమరచి చెప్పాడు.
అయ్యో నాకేం తెలియదండి ఎవరో చేసింది దానికి నేను ఎలా బాధ్యురాలిని అవుతాను అంది దివ్య. ఇదిగో చూడమ్మా అవన్నీ మాకు తెలియదు మాకు మీ సంబంధం నచ్చలేదు మేము వెళ్ళిపోతున్నాం అంటూ అప్పటికే అక్కడికి వచ్చిన మిగిలిన వారు అంటూ మా గొప్ప సంబంధమే తెచ్చాడు ఇంతకన్నా మంచి సంబంధం దొరకకపోతుందా పదరా వెళ్దాం అన్నారు రమేష్ తో.
ఇంతలో రామారావు గారు, బాబు ఎవరో చేసిన పనికి మా అమ్మాయిని అనడం నిందించడం న్యాయం కాదు తనకు ఏమీ తెలియదు మేము తనని అంత బాగా పెంచాం చాలా పద్ధతి అయిన అమ్మాయి అని అనగానే పద్ధతి అయిన అమ్మాయి అందుకే డేటింగ్ యాప్ లో ఫోటో పెట్టి అందరిని ఆకర్షిస్తుంది. ఇంకేం చేసిందో మహాతల్లి అంటూ రమేష్ వాళ్ళ అమ్మ అంటుంది.
చూడండి అనవసరంగా అమ్మాయి మీద లేనిపోని నిందలు వేయకండి నిజమేంటో ముందు ముందు తెలుస్తుంది నాకు కూడా మీకు సంబంధం అక్కర్లేదు అనుమానించే దానికి వారికి మేము మా పిల్లనివ్వం అంటూ చెప్పారు రామారావు గారు. చాలు చాలు మీరు మీ బోడి సంబంధం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ విసవిసా.
అప్పటివరకు ఆనందంగా ఎంతో సంతోషంగా గడుపుతున్న దివ్య కుటుంబంలో ఇది ఒక అపశ్రుతి లాగ ధ్వనించింది. కుప్పకూలిపోయిన దివ్య ఏడుస్తూ నాన్నగారు నేను అలాంటివి ఏమీ చేయలేదు నా గురించి మీకు తెలుసు కదా నేను అసలు ఫోన్ కూడా వాడను ఆ యాప్ ఏంటో నాకు అసలు తెలియదు అంటూ ఏడవ సాగింది రామారావు గారు ఇదంతా చూసి చెక్కున పడిపోయారు ఒక్కసారిగా ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు అసలు ఈ విషయమే తమ జీవితంలో పెద్ద మచ్చలాగా మిగిలిపోయింది.
అందులో ఉన్న ఫోటోను ఇప్పటివరకు ఎంతమంది చూశారో ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నారో ఇకముందు అమ్మాయికి పెళ్లి జరుగుతుందా మా కుటుంబం మర్యాదగా ఉంటుందా అనే ఆలోచనలతో నాలుగైదు రోజులు వాళ్లంతా సతమతమయ్యారు. చివరికి రామారావు గారు ఒక నిర్ణయానికి వచ్చారు ఆరోజు సాయంత్రం బజారుకు వెళ్లి పురుగుల మందుల షాపులో ఒక పురుగుల మందు డబ్బా కొనుక్కొని బిర్యానీ తీసుకొని ఇంటికి వచ్చారు.
దివ్యను అనురాధను హాల్లోకి పిలిచారు రామారావు గారు ఎందుకండి ఏమైంది అంటూ వచ్చిన అనురాధా దివ్యకు విషయం అర్థమైంది అతని చేతిలోనే పురుగుల మందు డబ్బాని చూస్తూ, దివ్య కూడా ఈ నాలుగు రోజులు చాలా మానసిక వేదన అనుభవించింది. ఏమీ తెలియని అమాయకురాలిని నడిబజార్లో నిలబెట్టారు అసలు ఎవరు వాళ్ళు నా జీవితాన్ని ఎందుకిలా చేశారు నాకే పాపం తెలియకుండా నేను పది మందిలో చులకన అయిపోయాను ఇక నా జీవితం వ్యర్థం అని అనుకున్న దివ్య కూడా సరే నాన్న మీ ఇష్టం అంటూ చెప్పింది ఏమండీ ఏమిటిది అంది అనురాధ.
అనురాధ ఒకసారి పరువు పోయాక ఇక పోయిన పరువు తిరిగి రాదు మన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు ఎవరు ముందుకు వస్తారు మనకు ఇదే సరైనది. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇందులో పాలుపంచుకోండి అందరం కలిసి ఒకేసారి తిందాం అంటూ బిర్యాని పొట్లం విప్పి అంతా ఒక విస్తరిలో వేశారు ఆ తర్వాత అందులో పురుగుల మందు డబ్బా మూత తీసి ఆ పురుగుల మందులు మొత్తం బిర్యానీలో కలిపారు.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందులోంచి తలా ఒక ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకుంటుండగా శభాష్ మంచి నిర్ణయం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారా అంకుల్ ఇలాంటి మంచి నిర్ణయం తీసుకొని మీ పరువును మీరే పోగొట్టుకుంటున్నారు తప్పు చేయకపోయినా తప్పు చేసాం అన్నట్టు సమాజానికి మేలు చేస్తున్నారా అంటూ వచ్చాడు రమేష్.
ఆ మాటలు వింటూ వెనక్కి తిరిగి చూసి రామారావు గారు నువ్వా మళ్లీ ఎందుకు వచ్చావు? మీరే కదా అసలు విషయం చెప్పింది మీ వాళ్ళ ముందు అంతా పరువు పోయింది మాకు ఏమీ తెలియకుండా మా అమ్మాయి ఎంత పద్ధతిగా పెంచినా ఆ ఒక్కడి వల్ల మా జీవితాలు అంతా చిన్నా భిన్నం అయిపోయాయి ఇక మాకు ఇది తప్ప ఇంకేం మిగిలింది అంటూ ఏడవడం మొదలుపెట్టారు.
భేష్ మీరు చచ్చిపోతే ఆ నింద తొలగిపోతుందా? మీరు మంచి వారే అని ఎవరైనా అనుకుంటారా బ్రతికి ఉండి మేము మంచి వాళ్ళం అని నిరూపించుకోవాలి కానీ చచ్చిపోయి ఆ నిందలు నిజం చేస్తారా? అసలు ఎవరు అలా చేశారు అనేది మీకు తెలుసా? ఇదిగో వీడే అలా చేశాడు అంటూ తన వెనుక నుంచి ఒకడిని తీసి ముందుకు తోశాడు.
ఏంటి నువ్వా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అతను మరెవరో కాదు దివ్య పక్కింటి అబ్బాయి వరుసకు తమ్ముడి వరుస అవుతాడు. ఏంట్రా తమ్ముడు నువ్వు ఇలా చేసావా నా ఫోటో ఎందుకు అందులో పెట్టావు అంటూ అడిగింది దివ్య.
నేను కావాలని చేయలేదు అక్కా ఏదో సరదాగా చేశాను అంతే తప్ప నా మనసులో ఏ ఉద్దేశం లేదు అన్నాడు వాడు.. రేయ్ ఏ ఉద్దేశం లేదా నాకు చెప్పింది ఏంటి ఇప్పుడు చెప్తుంది ఏంటి ఉన్న నిజం సరిగ్గా చెప్పు అంటూ ఒక్కటి పీకాడు రమేష్.
అది అది అదేం లేదు దివ్య నాకన్నా బాగా చదువుతుంది నాకన్నా మంచి మార్కులు తెచ్చుకుంటుంది దివ్యని చూసి నేర్చుకో అంటూ మా నాన్నగారు, అమ్మగారు ఇద్దరూ ఎప్పుడూ ఎత్తి పొడుస్తూ ఉంటారు. మా నాన్న మా ఇంట్లో ఎప్పుడు దివ్యనామ స్మరణే చెప్పా నా గురించి ఎవరూ పట్టించుకోరు అందుకే కోపంతో ఆ డేటింగ్ యాప్ లో తన ఫోటోని అప్లోడ్ చేశాను అంటూ చెప్పాడు వాడు.
ఛీ నువ్వు ఒక మనిషివేనా నీకు చదువు రాకపోతే చదువుకోవాలి అంతే తప్ప నన్ను బయటకు లాగుతావా అందరిలో నన్ను చులకన చేయాలని అనుకుంటావా? అయినా నీ తల్లిదండ్రులు నా గురించి చెప్తే దానికి తప్పు నాదా నా చదివేదో నేను చూసుకున్నాను తప్ప నీగురించి నేనేం చెడుగా చెప్పలేదే ఎవరితోనూ ఏమీ అనలేదే ఎందుకు ఇలా చేశావు అంటూ దివ్య వచ్చి వాడిని నాలుగు పీకింది.
సారీ అక్క నేను ఉక్రోషంతో అలా చేసానే తప్ప నాకు ఎలాంటి ద్వేషం లేదు. తర్వాత నేను డిలీట్ చేయాలని అనుకున్నాను కానీ అది ఎవరెవరికో ఫార్వర్డ్ అయిపోయింది.. అని అనగానే దానికి రమేష్ మరేం పర్వాలేదు నీ ఫోన్ తీసి ఆ డేటింగ్ యాప్ లోంచి ఆ ఫోటో అవన్నీ డిలీట్ చెయ్ అంటూ చెప్పాడు.
ఇంతలో అక్కడికి నలుగురు పోలీసులు వచ్చారు. రండి ఇన్స్పెక్టర్ గారు ఇదిగో ఇదే ఆ డేటింగ్ యాప్ ఈ యాప్ ని ఎవరు నడిపిస్తున్నారో తెలియదు కానీ ఇలాంటి ఏమీ తెలియని అమ్మాయిల ఫోటోలు పెడుతూ అందరిని ఆకర్షిస్తూ డబ్బులు లాగుతున్నారు. ఈ యాప్ ని మీరు డిలీట్ చేయించాల్సిందే అంటూ కంప్లైంట్ ఇచ్చాడు రమేష్.
మీలాంటి వారు ఇలా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము మా పని సక్రమంగా నిర్వర్తిస్తాము మీరు మంచి పని చేశారు వెంటనే అది డిలీట్ చేయిస్తాము అంటూ ఎవరెవరికో ఫోన్లు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ యాప్ అసలు ఓనర్స్ ఎవరో పట్టుకుని సాంకేతికత ద్వారా ఆ యాప్ ని వెంటనే డిలీట్ చేసి ఉంచారు ఇప్పుడు అందులో దివ్య ఫోటో గానీ మిగతా అమ్మాయిల ఫోటో కానీ లేదు.
ఇతని అరెస్టు చేయమంటారా అంటూ అడిగాడు తమ్ముడు అని చెప్తున్నా వాడిని చూపిస్తూ… లేదు సార్ వాడికి ఏమీ తెలియదు వాడు అమాయకుడు ఏదో చేశాడు ఇప్పుడు మీరు వాడిని అరెస్టు చేస్తే వాడి జీవితం నాశనం అవుతుంది వాడి చదువుతోపాటు కెరియర్ కూడా పోతుంది వదిలేయండి తెలియక చేశాను అంటున్నాడు కదా అది దివ్య.. అవును సార్ అంతే వదిలేయండి అన్నారు రామారావు అనురాధ దంపతులు.
ఈ కాలంలో కూడా ఇంత మంచి వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి మీకు చెడు చేసినా కూడా వాడిని వదిలేయమనడం మీ మంచితనాన్ని తెలియజేస్తుంది సరే ఇంకెప్పుడు ఇలా చేయకు మాకు అన్నప్పుడు నీదే నీ వైపే ఉంటుంది అనేది మర్చిపోకు అంటూ చెప్పి ఇక వస్తాను సార్ అంటూ రమేష్ కి చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.
నన్ను క్షమించండి అక్క అంటూ దివ్య కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు వాడు. సరే మీ ఇంటికి వెళ్ళు అని దివ్య అంది. అతను కూడా వెళ్ళిపోయాడు. ఇక అక్కడ మిగిలింది రమేష్, అనురాధ దంపతులు, దివ్య. చాలా సంతోషం బాబు నువ్వు నిజాన్ని నమ్మకుండా ఎవరు చేశారు అనేది తెలుసుకొని మాకు చాలా సహాయం చేశావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అన్నారు రామారావు గారు చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ఇప్పుడు కూడా పురుగుల మందు కలిపిన బిర్యాని తింటారా అంటూ అడిగాడు ఆ బిర్యానీని కవర్లో వేసుకొని చూపిస్తూ రమేష్.
లేదు బాబు మాకు జీవితం విలువ తెలిసొచ్చింది ఇది కాకపోతే ఇంకొకటి మీరు మీ తల్లిదండ్రులు కాదన్నా కూడా చాలా సహాయం చేశారు చాలా సంతోషం బాబు నీలాంటివారు మాలాంటి వారిని అర్థం చేసుకొని సహాయం చేయడం చాలా గొప్ప విషయం అన్నారు రామా రావు గారు.
మరి అంతలా పొగడకండి పెద్దలు పొగిడితే అల్లుడికి బాగోదు అన్నాడు రమేష్ ఏంటి బాబు ఏమంటున్నారు అన్నారు రామారావు గారు ఆపనమ్మకంగా చూస్తూ దివ్య కూడా చాలా ఆశ్చర్యపోయింది. అవును మీరు విన్నది నిజమే నాకు మొదటి చూపులోనే దివ్వ చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇలా చూసేసరికి కొంచెం ఆశ్చర్యపడ్డాను ఆ తర్వాత నేను దివ్యతో మాట్లాడినప్పుడు తను ఫోన్ కూడా వాడదు అనే విషయం తెలుసుకొని ఇది ఎవరు చేసి ఉంటారా అని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాను ఆ తర్వాత తెలిసింది మీ పక్కింటి వాడే అని మా అమ్మ నాన్నలకు కూడా విషయం అంతా చెప్పాను వాళ్లు కూడా మా పెళ్లికి ఒప్పుకున్నారు.
ఇక మీరు ముహూర్తాలు పెట్టించడమే తరువాయి అంటూ నవ్వుతూ చెప్పాడు రమేష్. దివ్యకు ఈ విషయం చాలా ఆశ్చర్యంగాను ఆనందంగానూ అనిపించింది. జీవితంలో ఒక అపశ్రుతి చోటు చేసుకున్న కూడా తనకు మంచే జరిగింది అని భావించింది.
వారం రోజుల తర్వాత అంగరంగ వైభవంగా దివ్య రమేష్ వివాహం జరిగిపోయింది.
డేటింగ్ యాప్స్ అనేవి చాలా ప్రమాదకరం అని చెప్పడమే ఈ కథ ఉద్దేశం. అలాగే ఆనందమైన జీవితంలో ఏదో ఒక అపశృతి దొరలడం సహజం. దానికోసం ఆత్మహత్య ప్రయత్నం చేయడం నేరం అనేది కూడా ఈ కథలో ఇస్తున్న సందేశంగా భావించి మీ అభిప్రాయాలు సూచనలు ఇస్తారని భావిస్తూ
– భవ్యచారు