సాయిచరితము
పల్లవి
నిను చూడాలని
నిను చేరాలని
తపియించేము సాయీదేవా
కరుణించవయా సాయీదేవా
చరణం
దైవ స్వరూపమై
భువి చేరితివని
నమ్మితిమయ్యా
రక్షించవయా
కాల పరీక్షకు
నిలువము మేము
మన్నించవయా సాయిదేవా
మా దోషములను
పరిహరించినచో
పురివిప్పునుగా మాతనువంతా
చరణం
శత్రువు మిత్రుడు
అందరు ఒకటే అని భావించి
ఆదరించెదవు
నిన్నే తలచి
నిను ధ్యానించిన
చిత్తముకెంతో శాంతి కదయ్యా
చివరకు మిగిలేదేమీలేదని
తెలిసిన మాకు
నీ కరుణొకటే చాలు కదయ్యా
భవసాగరముల బాధే పెరిగెను
అయినా మేము బాధేపడక
నీ లీలలు మే చదివితిమయ్యా
చరణం
నీ కృపతోటే ఎందరెందరో
ధన్యులుకాగా
అది తెలుసుకుని
నిను ప్రార్థించి వేడిన మాకు
అభయమునొసగి దారే చూపిన
భక్త వరదుడవు నీవేకాదా
నీ నీడందున ఉండిన చాలు
వేరేదేమి కోరము మేము
కాపాడేందుకు గురువుండునని
నమ్మితిమయ్యా సాయీదేవా
ఈ సత్యమునే మరువక మేము సాగెదమయ్యా.. సాయీదేవా
– సి.యస్.రాంబాబు