మా వోడు
నేను అంటే మాలచ్చ ని ఇక్కడ నాలుగు ఇళ్లలో పని చేసుకుంటూ నాకున్న ఒక్కగానొక్క కొడుకును సాదుకుంటు ఉన్నాను. ఇదిగో ఈ అమ్మ నా కథ ఎదో రాస్తా అంటే ఆ అమ్మకు నా ఈవరం చెప్తున్న, మా వోడు అదే నా బిడ్డ తండ్రి నాకు మొగుడు నారడు, ఆడి పేరు నరయ్య కానీ అందరూ అన్ని నారాన్ని సేశారు, నను అలాగే పిలుత్తా అన్ని అప్పుడప్పుడు అంటే మీకు తెలిసి పోయిoది కదా అప్పుడే మా వోడు కాస్త నా మాట ఇనుకుంటూ ఉంటాడు…
అప్పుడే కదా మగాడు పెళ్ళాం మాట వినేది, నన్ను అలా పిలవమని కూడా అంటాడు. నేను అలా పిలిస్తే వాడికి ఇష్టం అని అంటూ ఉంటాడు ఆ సమయానికి వాడికి ఏదీ తోస్తే అది మాట్లాడుతూ ఉంటాడు, వాడి నోరు, వాడి ఇష్టం ఆ రాత్రికి వాడు చెప్పింది వింటూ, వాడి చేతిలో నలిగి పోవడం చెయ్యకపోతే నా వీపు విమానం మోత మోగుతుంది, అందుకే కిక్కురుమనకుండా ఆ మాటలు వింటూ నా శరీరాన్ని అప్పగిస్తా, మరి నాకు స్పందనలు లెవా అంటే ఉన్నాయి.
కానీ అవి నాకు వొడికి పెళ్లి అయిన కొత్తలో మా వోడు నన్ను ఇడవకుండా ఉండేటోడు, ఇదిగో నాకు కొడుకు పుట్టేదాక అడు నాన్నిడిసి పోలె, కానీ నాకు కొడుకు పుట్టి నాకా నాకు కానుపు కష్టం అయ్యి ఈడూ బయటకు రావడానికి ఇబ్బందిగా ఉంటే నా మానాన్ని కొంచెంగా కోయడంతో నా మానం పెద్దగా అయ్యిందని వీడు అదే నా మొగుడు, మోగాడు అయిన నారి గాడు దాన్ని అదే ఆ పద్దు లంజెని తగులుకున్నాడు..
అనుకుంటే ఇజ్జత్ పోద్ది కానీ ఇదిగో ఈడి వల్లనే కదా నాకు రాని బుతు మాటలు అన్ని నేర్సుకుని మరీ తిడుతున్నా, ఎంత ఇళ్లలో పని చేసుకునే టోళ్లం అయినా ఈ గలీసు మాటలు మాట్లాడక పోయేవాళ్లాం, కానీ మాకు కోపాలొస్తాయి, తపాలొస్తాయి, అడు నా మానం పెద్దగా అయ్యిందని నన్ను ఇడిషి ఇంకో దాన్ని తగులుకున్నాడు..
మనలో మన మాట మరి మా వొడి కాయ సన్నగా, సిన్నగా ఉందని నేను ఆడిని ఇడిషి, ఇంకొన్ని కట్టుకొని పోలేదు, ఇంకొని తోనూ తిరగలేదు, వాడు చేసే పని నేను కూడా చేస్తే వాడి పరువు ఉంటాదా ఈ వాడల, అంతో ఇంతో నీతి గల దాన్ని కాబట్టి ఇంకా వాన్నే పట్టుకుని కుసున్నా,.. అయ్యో అమ్మ మనం ఆడొల్లం కావాల్సి ఈ మాటలు సెప్పున అమ్మ ఏమనుకోబాకండి, ఇవి ఇలాగే రాత్తారా, అమ్మ ఇలాగే రాయండి అమ్మ, ఇది ఒక ఆడదాని బాధగా అనుకొండి కానీ బూతులు అని అనుకోబకండి అంది మాలచ్చి…
అమ్మా మాటల్లో పడి నాలుగు ఐపాయే ఇగ నీకు చాయి పెట్టించి, నా పిల్లగాడు ఇసుకులు నుండి వచ్చే యాల అయింది పోత అని లోనికి టీ పెట్టడానికి వెళ్ళింది మాలచ్చిమీ..
– భవ్య చారు