బంగారు తల్లి
పుట్టింట్లో గారాబంగా పెరిగిన బంగారు తల్లి.
పుట్టింటి మురిపాల తల్లి..
ఘల్లు ఘల్లు మని గజ్జెలు కట్టి ఇల్లంతా సందడిగా తిరిగే ఓ బుట్ట బొమ్మ…
కాళ్ళకు పారాణి పెట్టీ అత్తింట్లో అడుగు పెట్టావు..
పుట్టింటి పరువుని అత్తింటికి గౌరవాన్ని కాపాడే ఓ ఇంటి దేవత… ఇంటికి దీపం ఇల్లాలు అంటారు..
ఆలీగా, కోడలిగా, ఆ ఇంటికి
వారసులను ఇచ్చే ఓ మాతృమూర్తి..
నీవు ఎక్కడ ఉంటే అక్కడ సిరులు పండే సిరుల తల్లి..
ఎందుకమ్మా చినబోయావు..
ఎందుకమ్మా మూగబోయావు..
ఎందుకమ్మా తల్లడిల్లుతున్నవూ
ఎటు పోయాయి నీ సందడి గంతులు..
ఎటు పోయాయి నీ చిరనవ్వులు..
ఎటు పోయాయి నీ కలలు..
కన్న వారి కల తీర్చాలని.. పెళ్లి చేసుకొని నీ కలలు మర్చిపోయావా..?
అత్తింటి కట్టు బాట్లకు లోబడి.. నిన్ను నువ్వు కొల్పోయావా..?
నిన్ను వంటింటికి పరిమితం చేసి ఇదే నీ సామ్రాజ్యం అని.. వంటింటి యువరానిగా ఓ బిరుదు తగిలించార..
ఇంటికి దీపం ఇల్లాలు అంటే ఆ ఇంటికి వెలుగునిచ్చే దీపం అనుకున్నా..
కాని వంటింట్లో వెలిగించే దీపం అవుతుంది అనుకోలేదు..
నీకు కలలు ఉంటాయి.. నీకు ఆశలు ఉంటాయి..
కానీ నిన్ను నెరవేర్చుకొనివ్వరు కదా..
ఎన్ని అన్నా ఎన్ని జరిగినా ఎం చెప్పినా ఇలా ఇంటికే పరిమితం చేస్తున్నారు.. ఇంకా కొంత మంది..
ఇలా ఇంట్లో ఉంటు తమ కలలను వంటింటికే పరిమితం చేసిన మహారాణులు ఎందరో..
అందరికి నా వందనాలు..
– వనీత రెడ్డీ