అబద్ధపు జీవితం
నేను గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పాను. రోజులు గడిచే కొద్దీ నా జీవితంలో గతంలో నేను చేసిన తప్పులకు ఇప్పుడు నేను నా పేరు మార్చుకొని ఒక అబద్ధపు జీవితం గడుపుతున్నాను. ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలాంటి జీవితం గడుపుతున్నానని. ఈ అబద్ధపు జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త సమస్యలు, కొత్త సవాళ్ళను ఎదుర్కొంటున్నా. నేను గతంలో చేసిన తప్పులను సరిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను.
ఆ తప్పులు నా మీద పగతో వేరు వాళ్ళు చేసి నింద నా మీద వేశారు. నేను అందరి దృష్టిలో దోషిగా మిగిలిపోయాను. ఈ అబద్ధపు జీవితంలో నా మీద చేసిన కుట్రలను నేను తెలుసుకున్నాను. వాళ్లకి వాళ్ల దారిలోనే బుద్ది చెప్పాను. ఒక మనిషి ఒక స్థాయికి ఎదగడం ఇష్టంలేక అసూయ, పగ పెంచుకొని తప్పు చేసి నా మీద నింద వేశారు. మన పక్కనే ఉంటూ మనకి వెన్ను పోటు పొడిస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అబద్ధపు జీవితం గడపడం చాలా కష్టం. గతం తాలూకు అనుభవాలు నన్ను బాధకి గురి అయ్యాను.
- మాధవి కాళ్ల