భిన్నంగా ఆలోచించు
“అహంకారానికి, ఆత్మన్యూనత భావానికి తేడా లేదు!” “అహంకారం” అంటే “నేను ఇతరుల కంటే ఎక్కువ” అని బయటకు చెప్పకపోయినా లోలోపల అనుకుంటూ దానికి తగిన విధంగా తెలియకుండానే జీవించడం, మాట్లాడడం. “ఆత్మన్యూనతా భావం” అంటే “నేను ఇతరుల కంటే తక్కువగా ఉన్నాను, అందరూ నాకంటే గొప్పగా ఉన్నారు” అని, బయటకు చెప్పకపోయినా లోలోపల మదన పడుతూ ఉండడం. అంటే ఇక్కడ అహంకారం కలిగిన వారు ఆత్మన్యూనతా భావం కలిగిన వారు ఇద్దరు, ఇతరులతో పోల్చుకొని ఎక్కువ లేదా తక్కువ అనుకునేవారే. ఎక్కువ అయితే ఆనందపడటం, తక్కువ అయితే బాధపడటం. ఎక్కువ కాలేక తక్కువ అయితే ఆత్మన్యూనతా భావం. అంటే ఇద్దరికీ పెద్ద తేడా ఏమీ లేదు. ఆత్మన్యూనత భావం కలిగిన వాడు నాకు అహం లేదు అనవచ్చు గాక కానీ లోపల ఉన్న ఆత్మ న్యూనత భావం ఏర్పడుతుంది. అహం సంతృప్తి చెందలేదు కాబట్టి ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. గమనించి ఈ ఎక్కువ తక్కువలు పక్కన పెట్టి ఆనందంగా జీవిస్తే అద్భుతంగా ఉంటుంది.
– మల్లికార్జున్ గుండా