ఒకరికి ఒకరుగా
ఒకరికి ఒకరు నచ్చితే
పెద్దవాళ్ళు పెళ్లి చేశారు..
ఒకరి మనసు మరొకరు తెలుసుకొని
ఒకరి ప్రేమని మరొకరికి పంచుకోవడం
ఒకరు తప్పు చేసిన మరొకరు ఏ పరిస్థితిలో
చేశారో తెలుసుకొని మందలించాలి…
వాళ్ళు మధ్య గొడవ జరగకుండా ఒకరికి
మరొకరు నెమ్మదిగా సర్ది చెప్పుకోవాలి…
ప్రతిదానికి గొడవే పరిష్కారం కాదు అని తెలుసుకోవాలి…
ఒకరు గురించి మరొకరు పూర్తి తెలుసుకొని
వాళ్ళతో మెలగాలి..
ఒకరికి ఒకరు ప్రాణంగా బ్రతుకుతారు..
ప్రతి భార్య భర్తలు అర్థనారీశ్వరతత్వంతో ఉండాలి..
అలాగయితే ఏ ఇంట్లోనూ గొడవలు జరగావు..
- మాధవి కాళ్ల