న్యాయమా నీవెక్కడ
న్యాయమా నీవెక్కడ…??
చట్టానికి చుట్టమా… రాజకీయానికి బానిసవా..?
ఎక్కడా.. నీవెక్కడ కనపడవే..
పేదింటి గడప నీ కంటికి కనపడదా.. పేదోడి కన్నీరు నీకు పట్టదా…
పేదోడి గుండె ఘోష… నీకు వినపడదా…
న్యాయమా నీవెక్కడ… ఎవరి కోసం ఉన్నావు…
అన్యాయం తో అల్లాడుతున్న పేదోడి ఆవేదన కనపడదా..
ఆకలితో చేయి చాచడానికి వస్తే కాలికింద తొక్కేసే వారి గర్వం నీకు కనపడదా…
న్యాయమా నీవెక్కడ..
తప్పులు చేసి దర్జాగా తిరిగే వారి అహంకారం నీకు కనపడదా…
చట్టాన్ని చుట్టంలా వారి పిడికిలితో బంధించే వారి పొగరు నీకు కనపడదా…
ఎక్కడున్నావ్ నువు న్యాయం అని నీ దగ్గర గోడు వెల్ల బోసుకునే వారిని కానక
అధికారం తో గర్వంతో, పొగరుతో, అహంకారంతో డబ్బు వ్యామోహంతో ఏదైనా చెయ్యొచ్చు అని తలపోగరుతో తల ఎగరేసే వాడి తల నరకగా రావే…
ఏ ఎందుకు..? అన్యాయం ముందు.. నీవు చేతులు ముడుచుకుంటూ కూర్చున్నావా…
పిలిచేది నన్ను కాదు… నాకు వారి గోడు వినపడదు అని దాక్కున్నావా..
బయటికి రావే.. అన్యాయాన్ని ఎదిరించే దైర్యం ఏమై పోయింది…
నీ ముందు అన్యాయం ఎంత.. కంటిలో నలుసు అంత..
ఉఫ్ అని ఊదేస్తావు అని అనుకుంటే..
కంటికి గాయం చేస్తానని మౌనంగా ఉంటావే…
ఎందుకు ఇంత భయంతో మమ్మల్ని అన్యాయం వైపు తోసి నీ పదం…
అంటే న్యాయం అని పలకడం కూడా చేతకాని దుర్మార్గుల చెంత ఎందుకు కళ్ళు మూసుకుని కన్నీరు పెడుతున్నవు…
ఒక్కసారి కళ్ళు తెరిచి బయటికి రా…
అలిసి సొలసి విసిగి పోయిన మనసుతో.. ఒక్కసారి గర్జించి రా బయటికి రా అన్యాయం తల నరికేయి…
న్యాయమా నీవెక్కడ…???
వస్తావా ఇకనైనా..?
నీకోసం ఎదురు చూసే మాకు ప్రశ్న గానే మిగిలి పోతావా..
న్యాయం అనేది లేదు అని ప్రాణం తీసుకునే గుండెలను.
హత్తుకుంటావా…?
ఏమో ఎం చేస్తావో..
మాకు న్యాయం అని గొంతు పోయేలా అరిచి.. ప్రాణం తీసుకోవడం తప్ప ఏమీ తెలియని అభాగ్యులం..
అన్యాయాన్ని ఎదురించి.. డబ్బుతో న్యాయాన్ని కొనలేని
నిరుపేదలం…
న్యాయమా నీవెక్కడ…
– వనీత రెడ్డీ