నాలో మార్పు
ఎన్నో ఆశలు మరిఎన్నో కోరికలు
కాలం అనే గడియారంలో నేను
ఎటు వైపు వెళుతున్నానో నాకే
అర్దం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు
కథలు చదవడానికి ఇష్టం పెంచుకున్న
అదే సమయంలో కొత్త వాళ్లతో పరిచయాలు అయ్యాయి…
ఇంట్లో జరిగే మొదటి శుభకార్యానికి నేను
వెళ్ళలేకపోతున్నా అనే బాధలో ఉండగా
బాధ తెలియకుండా నన్ను ఆనందంగా
ఉండేలా చేశారు…
వాళ్ళతో గడిపిన రోజులను నేను ఎప్పటికీ
మర్చిపోలేను…
కథలు రాయమని ప్రోత్సహించారు..
నేను కూడా అందరిలా రోజు మొత్తం బిజీగా ఉండేదాన్ని…
బాధ, సంతోషం, గొడవలు అన్ని రకాలు
అనుభవించాను…
నాలో మార్పు కారణం చాలా మంది ఉన్నారు..
నన్ను కొన్ని విషయాలలో వెనక్కి తగ్గేలా చేశారు..
ఎంత బాధ పడినా ఒదార్పి లేని మనిషిగా మిగిలిపోయాను…
ఇప్పుడిప్పుడే భవిష్యత్తు మీద నమ్మకం కలుగుతుంది..
నాలో మార్పు కారణం ఒకటి అని చెప్పలేను…
చాలా ఉన్నాయి..
చిరునవ్వుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతాను…
- మాధవి కాళ్ల