ఈ చెప్పుడు మాటలు
ఇవి విషమనసుల నిజస్వరూపాలకి నిదర్శనాలు..
మంచికి కంచె వేసి మానసిక వేదనలకి వేదింపులకు వేదికలు..
వినే వారి చెవులకు సోపానాలు
విందైన పసందులు..
నమ్మకాలకు అపనమ్మకాలకు మధ్య పరీక్ష పెట్టే నిప్పు కణికలు..
ఇవి లేని దేశం లేదు
ఇవి అనుభవించని కుటుంబం లేదు..
వీటి బారినపడని మనసు లేదు..
ఎంతైనా ఎంత ఎంత అని ఎత్తు పైఎత్తులు గా ఎదుగునో ఈ చెప్పుడు మాటలు..
బతుకు బాటలో ఇవి వేసే సవాళ్ళకు ఎదుర్కొనే సత్తా కలిగించుకుని
ముందుకు నడవడమే మనిషి మనసు కి ఇచ్చుకునే మానసిక ధైర్యం…
మాటలు స్ఫూర్తిని ఇచ్చి జీవితాలను నిలపెట్టగలవు..
చెప్పుడు మాటలు అంతరాయాల గాయాలను రగిల్చి జీవితాలను కొల్లగొట్ట గలవు..
చెప్పుడు మాటలు ఎంత ఎత్తు ఎదిగిన కొద్దీ కాలమే (నిజాలు నిజాయితీ అనేవి ఎప్పటికైనా తెలుస్తోంది కాబట్టి)..
మంచి మాటలు మరణం తర్వాత కూడా జీవిస్తాయి…
– సీతా మహాలక్ష్మి