కలియుగ దైవం
కొండల రాయుడి రూపం..
సదా మదిలో మెదిలే విశ్వరూపం
అది శతకోటి కాంతుల స్వరూపం
గోవిందాది కీర్తనల కారుణ్య రూపం
కమనీయం..కడు రమణీయం..
సమ్మొహనమైన చిత్రం
వర్ణణాతీతమైన చిత్రం
తలచిన వెంటనే తారసపడు చిత్రం
అడుగడుగునా నీ చిత్రం
ఆద్యంతం నీ చిత్రం..
ఓ జగన్నాధా…
నిన్నెరిగి నీలో కలువుటయే మాకు తెలియాల్సిన మంత్రం..
– కిరీటి పుత్ర రామకూరి