సఖీ

సఖీ

అతని యద పై ఎర్ర గులాబీగా
అతని మోము పై చిరునవ్వులా
యాతని యదలోతుల్లోని భావం లా
అతని కళ్ళలోని కావ్య నాయికలా
నండూరి యెంకిలా నవ జవ్వనిలా
లతలా మారిన నవతలా, నవ రాగ మల్లికలా
రతి నై కావ్య కన్యకనై, ముగ్ధ మనోహర రూపం లో
కలిసి పోవాలని, కదలి పోవాలని, ఆత్మ లో ఆత్మలా
నీడలో నీడనై, యదలో నీ గానమై, అణువణువు
నిండాలని, జీవితమంతా పండాలని కలగంటినే సఖి…

కానీ….

అపోహ అనుమానాలతో, అవమానించి అనుక్షణం
మాటల తూటాలతో గుండెల్లో గాయాలెన్నో చేసి
గునపాలతో గుచ్చీ గుచ్చీ, చేతలతో రక్కేసి, కట్టేసి
గిల్లేసి, మర్లేసి, చిత్రవధ చేసేనే చెలీ, ఇక నా కలలన్నీ
కల్లలాయేనే మరీ…

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *