చెరగని చిరునవ్వు సాక్షిగా
ఓ శర్వరి!
నా బాధను పంచుకునేందుకు
అంతటి ప్రభుద్దులు లేరు ఇచట
ఖేదం దాల్చిన హృదయం తోడ
అశ్రువులు నిండిన కన్నుల తోడ
ఏకాకినై నిల్చిన తరుణం కడ
సకుటుంబ సపరివార సమేతంగా నన్ను ఓదార్చ వచ్చినవా
ఏల ఆహ్వానింతు నిన్ను
ఎట్లు నా దరిచేరనింతు నిన్ను
మేము ఆధునిక జీవన వాసులం
ఆదివాసీ లకంటే హీనులం
మేము నిషుద్దులం మేము అసుర సంతతి వారసులం
ఆది నుండి అత్యాచారం ప్రభుద్దులం అంగాంగ వర్ణనతో అమూల్య బిరుదులు కాజేసం
మేము కీచకుని వారసులం మైధునం ఖేలి విళాశాలకు సొంగలు కారుస్తూ ఉంటాం
మేము పురాణాలూ పఠిస్తాం కావ్యాలను తీరాగేస్తాం వేదాలను వల్లిస్తాం
యత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవతః
అని సూక్తులు ప్రభోదిస్తాం
ఓ సోదరి…
మేము అంటరాని వాళ్ళం మా అభ్యున్నతి ఖండంతరాలు వ్యాపించాలని ఆశిస్తాం
మా సంస్కృతిలో స్త్రీ కి ఒక స్థానం ప్రచురించాం మా చర్యలతో
మైధునం భజారులో వెళకట్టాం మేము కామాందులం మేము మొహాందులం
అయ్యాయో!
మేము భరతమాత ముద్దు బిడ్డలం అని చెప్పుకుంటాం
నిత్యం మా తల్లిని స్మరిస్తూనే ఉంటాం మా తల్లి రూపం దాల్చిన ప్రతి స్త్రీ పై మా విన్యాసాలు ప్రదర్శింప చూస్తాం
ఇంకా చెప్పాలా
మేము తెలుగు తల్లి వారసులం కనిపించే ప్రతి స్త్రీతో ను మైధునం స్వప్నాలలో మునిగి తెలుతుంటాం
మా కన్నులు కాంచేది జారే పైటల కోసం
మా పెదవులు వెతికేది ఎర్రటి పెదవుల కోసం మా దేహం కోరేది సువర్ణ సాందర్యం కోసం
మేము వావి వరసులు లేని వాళ్ళం వయో పరిమితి గూర్చి చింత్తించని వాళ్ళం
మేము అసుర వారసత్వాన్ని అందిపుచుకున్న వాళ్ళం
స్వదేశీ స్త్రీలంటే మాకు మోహం విధేశీ స్త్రీలంటే మాకు వ్యామోహం మాకు హోదాలతో పని లేదు
వయస్సుల శోచన అవసరం లేదు విశ్వావిద్యాలయాలు సరస్వతీ నిలయాలనే భావన అసలే లేదు
ఓ శ్యామలంగి!
జాలితో నన్ను ఓదార్చ వస్తే
మా మగజాతి నిన్ను మైలు చేస్తుంది
నీ సౌందర్యానికి ముగ్దులై
మైధునం వాహినిగా మా పురుష లోకానికి పరిచయం చేస్తుంది అసలే ఏక వస్త్ర ధారిణివి నిన్ను వివస్త్రను చేయబూనుతుంది
తస్మాత్ జాగ్రత!
నీ చెలీకాడు చంద్రుడు మా మగజాతి వారసుడే
ఏదోక రకం మచ్చ కలిగిన వాడే
అయినా చెరగని మీ చిరునవ్వుల సాక్షిగా మీ స్త్రీ జాతికి నా భాష్పసందేశాన్ని పంపు
తస్మాత్ జాగ్రత్త
– అభినవ శ్రీ శ్రీ