జీవితం
ఆశలు, ఆరాటాలే తప్పా
గెలుపెలేని జీవితం….
నచ్చినపని చేయక
నచ్చని బ్రతుకులే జీవితం….
పాక నుండి మేడను చూసి
ఆలినీ కసిరే జీవితం…
గొప్పగా కలలు కన్నా
పేకమేడల్లా కూలిపోయే జీవితం…
హంగులు, ఆర్బాటాలంటూ
సాయంత్రానికి పస్తులుండే జీవితం…
ఆలుమోగుడుల అనర్థాలు
వీదిన పడిన బాలల జీవితం…
ఏ చీకటి అమావాస్య కమ్మిందో
కూసింత వెలుగులేనీ జీవితాన్ని….
అక్షరమక్షరం పదంగా మలిచినా
అతకని చితికిన బతుకులు…
చితికిన బతుకులకు
అతుకుల వేసి
వెలిగిద్దాం నవ జీవితాన్ని
– హనుమంత