ప్రణయ పూల వాన
నీలి గగనాలలో నిండు చందురుడు..
నీలాకాశ వీధుల్లో నీకై వేచిన తారకలు..
నీలిమేఘాల పానుపువేసిన మెరుపులు..
పారిజాత సుగంధ పుష్ప పరిమళాలు..
నీ రాకకోసం ఎదురుచూస్తున్నాయి కృష్ణా..
నీల మోహనా..నీ రాధ మొర వినరా..
ప్రణయ పూల వానలో నిను అభిషేకించెదరా..
ముగ్ద మనోహరరూపా నన్ను బ్రోవగ రారా..
ముకుందా..నీవులేని నా బతుకే చీకటి రా..
మాధవ..నీవే నా లోకంగా జీవిస్తున్నానురా.!
– ది పెన్