అమ్మ- అమ్మాయి

అమ్మ- అమ్మాయి

తల్లి గర్భంలో పురుడు పోసుకుని…. తల్లికి మరుజన్మ నిచ్చి భూమ్మీద పడ్డ పసిబిడ్డ…
తల్లి రక్తపు చుక్కలతో తయారయిన చనుబాలను తాగి… తల్లి ఎద పైన తన్నిన ఆ తల్లి ప్రేమగా బిడ్డ పాదాలను ముద్దాడుతుంది….
అలా చిన్నప్పుడే తల్లి ఎద పైన తన్ని ఎదుగుతూ వచ్చాక ఆ తల్లి గుండెలపై తన్నుతున్నాడు…
తనకి కడుపు నింపిన ఆ స్థానాలను.. ఇంకో అమ్మాయిలో కామంగా చూస్తున్నాడు…

మగాడు అది వాడికి అవసరంగా అవకాశంగా చూస్తున్నాడు… ప్రాణాలను సైతం తీస్తున్నాడు…
ఒక్కసారి తను ఆలోచించగలిగితే బాగుండు…

నీ తల్లి దగ్గర కడుపు నింపిన అవయవం…
ఇంకో తల్లి దగ్గర ఎందుకు అది ఇంకోలా కనపడుతుంది….

నీ తల్లి దగ్గర లేనిది కనిపించే బయటి ఆడదాని దగ్గర ఏముంది… ఆలోచించు ఒక్కసారి మానవా…

కనిపించే అమ్మాయిలో ఒక అమ్మను చూడు..

ఒకటి పురుడు పోస్తే…
ఇంకోటి నీ కడుపు నింపింది.

దయచేసి గ్రహించండి…
పుట్టిన పొత్తికడుపు నీ నలిపి..
కడుపు నింపిన ఎదను తన్ని…

ఇంకో ఆడదాని ప్రాణాలతో చెలగాటం ఆడకండి…

ఆడదాన్ని ఆటబొమ్మలా చూడకు..
నిన్ను సృష్టించే అమ్మగా చూడు…

నీకు నువ్వు కొత్తగా కనపడతావు… నువ్వు మారిన రోజున…

– వనీత రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *