గాలిలో దీపం

గాలిలో దీపం

నేనూ పాసయ్యానోచ్ అంటూ ఆనందంగా వచ్చాడు నాని. ఏరా నాని నిజమా? కంగ్రాట్స్ రా అన్నాడు వేణు. థాంక్స్ రా అనగానే వేణు అనుమానంగా అవును రా నువ్వసలు బుక్స్ పట్టనే లేదు ఎలా పాస్ అయ్యావు రా అంటూ అడిగాడు.

అరే ఏన్ని రోజులూ ఆ పుస్తకాలతో కుస్తీలు పడుతూ మీరెంత చదివినా వచ్చేవి ఆ మాత్రం పాస్ మార్కులే కదా, నేను పుస్తకం పట్టుకున్నా, పట్టుకొక పోయినా పాస్ అవుతానని మా ఊరు పూజారి చెప్పారు రా నువ్వు దేవుణ్ణి నమ్ముకుని నాలుగు వారాలు ఒంటి పూట భోజనం చేస్తూ ఉపవాసం ఉంటె చాలు నువ్వు తప్పకుండా పాస్ అవుతావు అని అందుకే రా నేను మీలాగా బుక్ పట్టుకోకుండా దేవుణ్ణి నమ్మాను అన్నాడు నాని సంతోషంగా…

దానికి వేణు మొహం చిరాకుగా పెడుతూ ఏంటి దేవుణ్ణి నమ్మి ఉపవాసాలు ఉంటే నిన్ను పాస్ చేశాడా? ఒరేయి ఇది నమ్మేలా ఉందా అసలు ఏదో అదృష్టం కొద్ది బుక్ పట్టుకొక పోయినా పాస్ అయ్యావు కానీ ఆ దేవుడి వల్ల కాదురా నువ్వు ఉపవాసాలు ఉండడం అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్ముకుని రాస్తే ఎలాగూ పాస్ అవుతావు అన్నాడు వేణు. అయితే ఎంట్రా నువ్వు దేవుణ్ణి నమ్మవా అన్నాడు నాని చిరాకుగా….

దానికి వేణు అరేయ్ నేను దేవుణ్ణి నమ్ముతాను. కానీ నీ అంత పిచ్చి గా మాత్రం కాదు. మనము కష్టపడకుండా ఏది రాదు రా దేవుడు చెప్పేది కూడా అదే నీ పని నువ్వు చెయ్యి ఫలితం ఆశించకు అని నేను అదే నమ్ముతాను, అలాగే మంత్రాలకు చింతకాయలు రాలతాయి అంటే నమ్మను. నీ ఉపవాసాలు మానేసి గట్టిగా చదువుకో అన్నాడు వేణు.

సర్సర్లే…. నేను చదవకున్నా పాస్ అయ్యాను అని నీకు కుళ్ళు నాకు తెలుసు లేరా పెద్ద చెప్పొచ్చావు అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాని. వాడి మూర్ఖపు మాటలకు బిత్తరపోతూ, వీడిని ఈ జన్మలో మార్చలేము అనుకుంటూ నిట్టూర్చాడు వేణు.

********

నాని ఈ కాంపిటీటవ్ పరీక్ష లకు బాగా చదువు రా, దీంట్లో పాస్ అయితే నీకు ఉద్యోగం వస్తుంది అంటూ కొన్ని పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు వేణు. నాకు ఇవన్నీ అవసరం లేదు రా నాకు నా దేవుడు ఉన్నాడు. మా పూజారి గారు కటిక ఉపవాసం ఉంటూ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే ఉద్యోగం గ్యారంటీ అని చెప్పాడు. ఇక నాకు పుస్తకాలతో పని లేదు రా అంతా ఆ దేవుడే చూసుకుంటాడు అన్నాడు ఆనందంగా నాని.

నాని మాటలు విన్న వేణు అది కాదురా నేను చెప్పేది విను అంటున్నా కూడా నాకు తెలుసు నీకు కుళ్ళు వెళ్లురా ఇక్కడి నుండి అన్నాడు నాని. ఇంకా వీడికి చెప్పి దండగ అనుకుంటూ పుస్తకాలు అక్కడ పెట్టేసి బయటకు వెళ్ళిపోయాడు వేణు .

********

హలో వేణు నువ్వు అర్జెంటు గా హాస్పిటల్ ఆసుపత్రికి రారా అంటూ చటుక్కున ఫోన్ కట్ చేశాడు చిన్నా… హా ఏంటిది వేస్ట్ గాడు ఫోన్ చేసి మాట్లాడేది ఎవరో కూడా అడగకుండా అలా చెప్పేసి కట్ చేశాడు. మళ్ళీ వీడెం చేశాడో, ఏంటో ఏమైందో ఇప్పుడు ఇంత పెద్ద ఊర్లో ఏ హాస్పిటల్ కి అని వెళ్లాలి అని అనుకుంటూ ఏ హాస్పిటల్ అని మెసేజ్ పెట్టాడు దానికి వెంటనే చిన్నా నుంచి రిప్లై వచ్చింది పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ అనగానే సరే వస్తున్నా అని తిరిగి రిప్లై ఇచ్చి బైక్ మీద హాస్పిటల్ బయలుదేరాడు.

ట్రాఫిక్ ఎక్కువ లేకపోవడంతో ఐదు నిమిషాల్లో ఆసుపత్రికి చేరుకుంటూ బయటే ఉన్న చిన్నాతో ఏంట్రా ఏమైంది అలా ఫోన్ చేసి అవతలి వైపు ఎవరున్నారో కూడా చూసుకోకుండా గబగబా నీ మానాన నువ్వు చెప్పేస్తే నాకు ఎలా తెలుస్తుందిరా అంటూ చిరాకుగా అన్నాడు నన్ను తిట్టడం తర్వాత అంటూ గబగబా చేయి పట్టుకొని లాక్కుపోయాడు చిన్న.

ఏంటి వీడు ఇలా లాక్కుపోతున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమైనా అయిందా లేకపోతే ఇంకెవరికైనా ఏమైనా అయిందా అని తెలియని అయోమయంలో చిన్నాని అనుసరించాడు వేణు.

చిన్న వేణుని డైరెక్టుగా ఐసియు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు అక్కడ ఐసీయులో నాని బెడ్ మీద పడుకొని ఉండడం చూసి ఏంట్రా ఏమైంది నానికి? ఈసారికి పరీక్ష రాసి రావాలి కదా అన్నాడు వేణు అయోమయంగా….

ఇంకేం పరీక్ష రా వీడు నెల రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు కనీసం నీళ్లు కూడా తాగకుండా నెల రోజుల నుంచి అలాగే ఉన్నాడట. ఈపాటికి పరీక్ష రాసి వచ్చి మనకు ఎలా రాశాడో చెప్పాల్సిన వాడు ఇప్పుడు బెడ్ మీద పడుకున్నాడు.

డాక్టర్లు 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం అంటున్నారు రా అన్నాడు చిన్న కళ్ళనిండా నీళ్లతో…. ఆ మాటలు విన్న వేణు అరే నేను వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాను దేవుణ్ణి నమ్మాలి కానీ మరీ ఇంత పిచ్చిగా ఉపవాసాలు ఉంటూ నేను పరీక్ష రాయగలను అనే మూర్ఖత్వం వద్దురా బాగా చదువుకొని పరీక్ష రాయి అని చెప్పాను అయినా వినలేదు.

మనము మన పని మనం చేసి ఫలితాన్ని దేవుడికి వదిలేయాలి అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అని ఏ పని చేయకుండా కూర్చుంటే మన పనులేవీ కావు కష్టపడనిదే ఏదీ రాదు వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఆ పూజారి గారిని నమ్ముకుని ఇలా ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు అంటూ బాధపడ్డాడు వేణు.

అరేయ్ మన ముగ్గురం చిన్ననాటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉందా ఇప్పుడు వాడికి ఏమైనా అయితే ఎలా రా అంటూ ఏడవసాగాడు చిన్న. బు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏం చేయకు వాడికి ఏమీ కాదు డాక్టర్స్ ఎక్కిస్తున్నారు కదా రేపటి వరకు లేచి కూర్చుంటాడు చూడు. పద వెళ్లి డాక్టర్ గారితో మాట్లాడేసి వద్దాం అంటూ తనకు మనసులో భయంగా ఉన్నా చిన్నాని ఓదారుస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్లారు ఇద్దరు. సార్ మా వాడికి ఎలా ఉంది ఏం సమస్య లేదు కదా అంటూ అడిగాడు వేణు డాక్టర్ గారిని.

ఏమయ్యా నెల రోజుల నుంచి అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఎవరైనా ఉండగలరా అలా ఉండాడానికి అతను ఏమైనా దేవుడా అంటూ కోప్పడుతూ ఆ ఏం పర్లేదులే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నాం కానీ రేపటి వరకు ఏమీ చెప్పలేం 24 గంటలు గడవాలి అంటూ డాక్టర్ గారు చెప్పి ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటే మంచిది అన్నాడు అలాగే డాక్టర్ అలాగే మీరు జాగ్రత్తగా చూసుకోండి మా మిత్రుడు మాకు దక్కితే మాకు అంతే చాలు అంటూ రెండు చేతులు జోడించాడు వేణు. సరే మేము మా ప్రయత్నం చేస్తాం మీరేం గాబరా పడొద్దు అంతా ఆ పైవాడి దయ అన్నారు డాక్టర్ గారు. డాక్టర్ దగ్గర సెలవు తీసుకొని బయటకు వచ్చి వేణు.

చిన్నాతో చూసావా డాక్టర్ గారు కూడా ఏమన్నారు మా ప్రయత్నం మేము చేస్తాం తర్వాత దేవుడి దయ అన్నారు అంటే అర్థమేంటి మనం చేసేది మనం చేయాలి.

ఆ తర్వాత ఫలితం దేవుడు ఇస్తాడు కానీ ముందే అంతా దేవుడే చూసుకుంటాడు అంటే కుదరదు కదరా వీడి పిచ్చి ముదిరి పాకాన పడుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే మంచిదే అనుకుంటూ అక్కడే బెంచీల మీద ఇద్దరు కూర్చున్నారు. అరేయ్ వేణు నాని వాళ్ళ అమ్మగారికి కబురు చేద్దామా అడిగాడు.

దానికి వేణు అరేయ్ ఉన్న ఒక గాను ఒక కొడుకుని నమ్ముకుని ఆవిడ ఆ చిన్న ఊరిలో కష్టపడుతూ తనని చదివిస్తుంది ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ముందు ఆవిడ గుండెలు ఆగిపోతాయి అందుకే ఇప్పుడు ఏమి చెప్పొద్దు నానికి ఏమీ అవదు అంతా బాగవుతుందిలే నువ్వేం కంగారు పడకు అంటూ ఆ రాత్రంతా కళ్ళల్లో వత్తులు వేసుకొని ఏమీ తినకుండా స్నేహితుడి కోసం గంట, గంట కి చూస్తూ ఉన్నారు ఆ మిత్రులు ఇద్దరూ.

బాబు బాబు లేవండి అంటూ డాక్టర్ పిలుపుతో చదువుకున్న కళ్ళు తెరిచారు చిన్నా వేణువులు ఆ వేయించి మీరే తెలియకుండానే నిద్రపోయారు. నిద్ర కళ్ళతో ఎక్కడున్నావు ఒక్క నిమిషం గుర్తుకు రాక ఆ తర్వాత కొంచెం మత్తు వదలగానే కళ్ళముందు డాక్టర్ కనిపించడంతో తామె ఎక్కడున్నది గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ సారీ సార్ అనుకోకుండా అని నీళ్లు నమిలాడు వేణు.

పర్లేదు లేవయ్యా రాత్రంతా నిద్ర ఎలా కాయగలరు. పర్లేదులే అని డాక్టర్ అన్నావని సార్ మా వాడికి ఎలా ఉంది అంటూ అడిగాడు వేణు గాబరాగా.
ఆ విషయం చెప్పాలనే మిమ్మల్ని లేపాను లేకపోతే లేపే వాడినే కాదు అన్నాడు నవ్వుతూ డాక్టర్ నవ్వు మొహం చూడగానే వేణుకి అర్థం అయిపోయింది తమ నాని తమకు ఉన్నాడు అని.

వెంట అయినా డాక్టర్ నోటి వెంట వినాలని ఉద్దేశంతో సార్ ఇప్పుడు మా వాడికి ఏం పర్లేదు కదా అంటూ మళ్ళీ అడిగాడు ఏం పర్లేదు అయ్యా అంతా బాగున్నాడు ఇప్పుడే స్పృహలోకి కూడా వచ్చాడు మీరు వెళ్లి చూడొచ్చు అంటూ చెప్పి జాగ్రత్త ఎక్కువ విసిగించకండి ఎక్కువ ఒత్తిడికి గురి చేయకండి అంటూ వెళ్లిపోయారు డాక్టర్ గారు.

గబగబా ఇద్దరు ఐసీఏలోకి వెళ్లారు అక్కడ కళ్ళు మూసుకొని నిస్త్రానగా పడున్న నానిని చూస్తుంటే ఇద్దరికీ దుఃఖం ఆగలేదు కలలోంచి టప టపా కన్నీళ్లు రాలుతున్నాయి.మళ్లీ వాడు ఎక్కడ చూస్తాడు అనుకుంటూ కన్నీళ్లు తుడుచుకుని ఇద్దరు దగ్గరగా వెళ్లి నాని అంటూ పిలిచారు నెమ్మదిగా ఆ మాటలకు నెమ్మదిగా కళ్ళు తెరిచిన నాని వాళ్ళిద్దర్నీ చూసి ముఖం పక్కకి తిప్పుకున్నాడు.

వేణు దగ్గర కూర్చొని ముఖం తన పక్కకి తిప్పుకుంటూ రేయ్ నాని బాధపడకు రా మరో వారం రోజుల్లో ఇంకొక నోటిఫికేషన్ పడబోతుంది దానికి పరీక్ష రాసి ఉద్యోగం వస్తుంది రా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అన్నాడు.
దానికి నాని వేణుని చూస్తూ ఏంట్రా నా మీద మీకు కోపంగా లేదా అన్నాడు అరేయ్ నీ మీద మాకు కోపం ఎందుకు రా నువ్వు మా స్నేహితుడివి రా ఒకసారి తప్పు చేసిన నీ తప్పుదిద్దడానికి మేము ఎప్పుడూ నీ వెనకాలే ఉంటాం అన్నాడు వేణు. అవున్రా నాని మేమెప్పుడూ నీతోటే ఉంటాం మనం ఎప్పుడూ కలిసే ఉండాలి మనం ఎవరం విడిపోవద్దు అన్నాడు చిన్న.

అరేయ్ మీరు చెప్పిన మాటలు వినకుండా నేను పూజారి మాటలు నమ్మి చదవకుండా నా ప్రాణాల మీదికి తెచ్చుకున్నాను కనీసం అమ్మ గురించి ఆలోచించినా ఇంత దూరం రాకపోయేది అంటూ బాధపడ్డాడు నాని.

దానికి వేణు చూడు నాని ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి మూఢనమ్మకాలు నమ్మకుండా నీ కష్టాన్ని నమ్ముకుని బాగా చదువు తప్పక నీకు ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంతో మీ అమ్మగారిని బాగా చూసుకోగలవు అన్నాడు.
ఆ పూజారి నాకు చెప్పిందంతా అబద్ధం రా ఇప్పుడే వాడికి ఫోన్ చేసి తిడతాను అన్నాడు నాని ఆవేశంగా, ఎందుకురా ఆయన్ని తిట్టడం నువ్వు చేసే పని నువ్వు చేస్తూ దేవుని స్మరిస్తే ఆయన చూసుకుంటాడు అని ఆ పూజారి గారు చెప్పి ఉంటారు.

అంతేతప్ప నువ్వు దాన్ని గుడ్డిగా నమ్ముతావని ఆయన మాత్రం ఊహించి ఉంటాడా వద్దు నువ్వు అతనికి ఫోన్ చేసి తులనాడవద్దు. కటిక ఉపవాసం చేయమంటే బ్రహ్మచర్యం పాటిస్తూ నీ పని అంటే నువ్వు పరీక్షలకు చదువుకునేది చదువుకుంటూ చదువు మీద ఏకాగ్రత పెట్టుకోవడం అని నీకు తెలియక పోవడం నీ తప్పు అంతేకానీ ఆయన తప్పు కాదు సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది ఇకముందు ఇలాంటి గాలి మాటలు అన్ని వదిలేసి ఏకాగ్రతతో చదువుకొని ఉద్యోగం సంపాదించు అన్నాడు వేణు నాని భుజం మీద చేయి వేస్తూ.

అవున్రా నువ్వు చెప్పింది నిజమే. ఆ పూజారితే ఏం తప్పులేదు తప్పంతా నాదే గాలిలో దీపం పెట్టి ఏమీ చదవకుండా ఉద్యోగం రావాలంటే ఎలా వస్తుంది మన పని మనము చేసిన తర్వాత ఫలితాన్ని చూడాలి అంతేకానీ ముందే ఫలితం కోసం అత్యాశ పడడం మంచిది కాదని నాకు బాగా అర్థమైంది రా. ఇకనుంచి బాగా చదివి ఉద్యోగం సాధిస్తాను అమ్మను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అంటూ వేణు చేతిలో చేయి వేస్తాడు అవున్రా మన ముగ్గురం కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించాలి అంటూ చిన్న కూడా వారి చేతిలో తన చేతిని కలిపాడు.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *