లేఖ
చినుకులు కురవని నేలలా
వరదే పొంగని వాగులా….
నీప్రేమకై వేచిచూస్తూన్న
నిను చేరని లేఖనై…
దేవుని చెంతకు చేరని పువ్వులా
మట్టినే చేరని నినిగినై
పూజించే అర్చకుడికే వరమివ్వని దేవతకు
రాసుకున్న చేరని లేఖ…
నీకోసమే ఆరాటపడే గుండె
నిరంతరం నీరూపాన్నే కలగంటూ
గుండెలో గుడికట్టి దేవతలా ఆరాధిస్తూ
గుడిబయట బిచ్చగాడిలా నిను చేరని లేఖ నైతిని
– హనుమంత