అలుపెరగని బాటసారి
ఓక ఇంటిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అందులో పెద్దవాడికి పెళ్లి అయింది. చిన్నవాడికి పెళ్లి కాలేదు. పెద్దవాడు కాస్త కష్టపడినా కొంచెం కుటిల బుద్ధి కలదు. చిన్నవాడు చాలా మంచివాడు. ఎక్కువగా కష్టపడి తన అన్న చేతిలో పెట్టేవాడు.
తాను సంపాదించినా దాని కన్నా తమ్ముడి సంపాదనతో ఇల్లు గడిచేది. కాని తన అన్న భార్య తనను మంచిగా చూసేది కాదు. తన భర్తకు తెలియకుండా మరిదిని చిత్రహింసలు పెట్టేది. ఎంతో అవమానించేది. కాని భర్త ముందు మాత్రం మరిదిని పొగిడి, నీతి వాక్యాలు వల్లించేది.
“నాయానా! కష్టాలు మానుషుల కాక మానులకు వస్తాయా చెప్పు… అంటూ భర్త ముందు నటించేది. అమ్మ లాంటి వదినమ్మ హింసిస్తుంది అని అన్నకు చెప్పలేక తనలో తాను కుమిలి పోయేవాడు. ఎప్పటికైనా నిజం దానంతట అదే తెలుస్తుంది అని ఊరుకునేవాడు.
ఇంతలో ఒక రోజు తన నగ పోయిందంటూ మరిది తిసేసాడు అంటూ నిందలపాలు చేసి తమ్ముడుకి, అన్నకి మధ్య గొడవ పెట్టింది. ఆ బాధను భరించలేక బయటికి వెళ్లి, తన కాళ్ల మీద తాను బ్రతకాలని నిర్ణయం తీసుకున్నాడు.
నిర్ణయం అయితే తీసుకున్నాడు గాని బయట ప్రపంచం సవాళ్లుగా మారింది. చిన్న చితక పని చేసి, చదువు లేకపోయినా ఎదోలా జీవనం చేసేవాడు. ఇపుడు బయట ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఆలోచనతో దారి బాట పడుతూ… ఎండలో అలసిపోయి ఆకలితో అలమటింది.
తన బతుకు మీద ఆశలు వదులుకునే సమయంలో దారిలో ద్విచక్ర వాహనంలో ఏదో సమస్యతో నడపలేని ఒక వ్యక్తిని చూసి… తనకు తెలిసిన కొద్ది పాటి మెకానిజంతో అతనికి సహాయం చేసాడు.
“ఎప్పుడో నేర్చిన విద్య ఇప్పుడు ఒక దారిని చూపింది అని ఆనందంతో చిన్న చిన్నగా మొదలు పెట్టి అందరాని ఆకాశం లా, అందలం ఎక్కి తిరుగులేని అలుపురాని బాటసారిలా తన జీవన శైలి కొనసాగించాడు.
అందుకే ఓ బాటసారి…..
నువ్వు వెళ్లే దారిలో రాళ్లు ఉండని, రప్పలు ఉండని…
అడుగడుగునా అవమానాలు, ఆటంకాలు ఉన్న నీ గమ్య గదుల తలుపులు తెరిచేలా సాగించు… కోనసాగించు…
ఓ బాటసారి…
– తోగరాపు దేవి