మన వన భోజనం
కార్తీకమాసం
మనందరి కోసం
ఇందిర పార్కు కలిపె
మనందరినొక చోట
వనమందు భోజనం
మన విందు ఎంచక్క
కను విందు చేయ
పచ్చదనమందు
మనమందు వికాసం
ముఖమందు వికసించె
చిందులు వేసె అందరు
ఆనందము తోడ
స్టెప్పులన్న అందరికి
ఎంతొ మక్కువ
వేసె పెద్దలు కూడ
ఎంతొ ఎక్కువ
ఏమాటకామాట
చెప్పుకోవాలంట
ఇంట చేసిన వంట
వంట పట్టునంట బాగ
నవ్వులు పువ్వులు పూసె
ఆ పచ్చదనము లోన
జంటల నృత్యము చూడ
అబ్బురబోయి చూచు చుండె నెమళ్ళు
పొరపొచ్చాలు లేని
ఇలా వనభోజనాలుంటే
అవద ప్రతి మాసం
ఒక కార్తీక మాసం
– రమణ బొమ్మకంటి