వ్రాత
మూడు ముఖాలు ముందుకి చూస్తున్నా….
వెనుకుండి రాస్తున్నదేమిటని తెలిసేనా…
భారతి వీణానాదంలో మునిగి తరిస్తున్నా….
అర్దంతర ఆయుష్షులకి వగచేది వినబడునా….
కుమారుడే ప్రశ్నిస్తూ అడ్డుపడుతున్నా….
విధిలిఖితం తప్పించగ తనకైనా సాధ్యమౌనా…
కుమార్తెకే సరియగు రాత రాయలేకున్నాడు…
అంద చందాలమేటియైనా రాయల్లే పడెను అహల్య…
సిరిసంపదలెన్నున్నా వగచినారు నలదమయంతులు…
ఫాలముపై లిఖించబడగా తప్పించుట సాధ్యంకానిది…
వెలుగన్నది సుఖమై నిండిన జీవితాలలో….
నిశీధుల కష్టాలు తప్పని తెలుపునుగా…
ఐతిహాసపు గాధలెన్నో అక్షరక్షరమున తెలుపునుగా…
బ్రహ్మ రాత తలరాతై మన జీవనముండగా…
జీవనములో దాగిన సన్నని పొరవంటి కళ ఇది…
ఈ కళ వెనుక దాగిన రాతల మాటున దాగిన సత్యాలెన్నని…
ఆ సత్యాల మాటునున్న లేఖకుల జీవిత లిఖిత మేమిటని….
చదరంగంగా సాగే జీవితాన పాత్రలైన మన రాతల సారమేమిటని…
– ఉమామహేశ్వరి యాళ్ళ