ఘరానా (ఖజానా) మోసగాళ్ళు
*********
అప్పు అడుగ బోతె బ్యాంకు అర్హతేమిటన్నారు
పుస్తెల తాడిస్తనంటె పూచికత్తు అడిగారు
చిల్లర కొట్టు పెడతనంటె షూరిటి ఇమ్మన్నారు
షూరిటీని తేలేక కూలినాలిజేసుకుంటి
ఉన్నోడికి బ్యాంకులన్ని ఊడిగాలు చేస్తాయి
కోటు వేసుకున్నోడికి కోట్ల అప్పులిస్తాయి
అప్పు ఇచ్చివంగి వంగి దండాలు పెడతారు
దొంగ సంతకాలు పెట్టి కోట్లు దోచుకుంటారు
బ్యాంకు లన్ని కొల్లగొట్టి బలాదూరు తిరుగుతారు
ప్రభుత్వాలు వారి అప్పు మాపీలు చేస్తుంది
ఎన్నికలప్పుడు వారే ఖర్చులకు ఇస్తారు
దొందు దొందు దొంగలయితె బ్యాంకు దివాల దీస్తుంది
-కోట