రాజరాజచోళుడి కథే పొన్నియన్ సెల్వన్
పొన్నియన్ సెల్వన్ సినిమాని బాహుబలి తో పోల్చి తెలుగు ప్రేక్షకులు నిరాశ చెందారు కానీ అదే పేరుతో వచ్చిన (ఐదు భాగాల) నవలకు చక్కని దృశ్య రూపం సినిమా పియస్1
చోళ, పాండ్య రాజుల వైరం ఒకపక్క ఇంకోపక్క సుందరచోళుడు సామ్రాజ్యంలో అంతఃకలహాలు, కుయుక్తులు, కుట్రలు ఈ మొదటి భాగంలో కనిపిస్తాయి. తమిళ రచయిత కల్కి రచించిన ఐదుభాగాల నవలను తెరకెక్కించాలన్న మణిరత్నం రెండు దశాబ్దాల కల ఈ సినిమా. నవల రెండు భాగాలతో మొదటి భాగం సినిమా వచ్చింది
తెలుగు, తమిళ సినిమా అభిమానుల మధ్య ట్విట్టర్ లో మాటల యుద్ధమే నడిచింది. మన సమీక్షకులు కూడా సినిమాను ఏకేశారు. Elevation moments లేవని వీళ్ల ఫిర్యాదు.
ఈ సినిమాను నవలకు అనుగుణంగా తీశాడు దర్శకుడు. పాత్రల చిత్రణలో గందరగోళమేమీలేదు. పాత్రధారుల నటనకు వంకపెట్టలేము. గ్రాఫిక్స్, రంగాలంకరణ topnotch గా చెప్పుకోవచ్చు.
కాస్త రెహమాన్ నేపథ్యం సంగీతమే కాస్త నిరాశపరిచింది. విక్రం, కార్తీ, జయం రవి, ఐశ్వర్యా బచ్చన్, త్రిష, జయరాం ముఖ్య పాత్రలలో అలరించారు.
నాకు బాగా నచ్చింద తనికెళ్ళ భరణి సంభాషణలు..ఆర్టిస్టులు పలికినతీరు.తోట తరణి ప్రొడక్షన్ డిజైనింగ్ ప్రశంసనీయంగా ఉంది. ముఖ్యంగా శ్రీ వైష్ణవుడు నంబి పాత్ర కు భరణి డబ్బింగ్ చెప్పిన తీరు అమోఘం..
పొన్నియన్ సెల్వన్ అంటే కావేరి నదీ పుత్రుడని. మనకు పరిచయం లేని పేరు. అదే తంజావూర్ లో బృహదీశ్వరాలయం కట్టించిన రాజరాజచోళుడంటే మనం కనెక్ట్ అవుతాం..
ఇది ఫాంటసీ డ్రామా కాదు. పీరియడ్ డ్రామా.. అది గుర్తుంచుకుంటే సినిమాను ఆస్వాదిస్తారు..
– సి. యస్. రాంబాబు