సంఘర్షణ పార్ట్ 4
అయ్యా చెప్తున్నా వినండి ఉభయిలకు ఉపయోగ పడుతుంది. అసలు మీరు బాకీ అడగడం ఆయన తీర్చడం మాట అటుంచి మీ కొడుక్కు , ఆయన కూతురు కు పెళ్లి చేస్తే ఆయిపాయే , ఇక బాకీ డబ్బుల మాటలు లేకుండా హాయిగా మీరు వియ్యంకులు అవుతారు. వియ్యంకులు మధ్యలో డబ్బు మాట ఎందుకు అన్నాడు నాగయ్య.
ఆ మాట వినగానే మూర్తి గారు ఏంటి నాగయ్య గారు ఇది, రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు. పెళ్లి కొడుకు నా కూతురు ఇష్టపడ్డారు , పైగా నేను ఎప్పటి నుండో అనుకున్న సంబంధం ఇది ఇప్పుడు ఎలా ఎలా మార్చాలి అంటారు,
పెళ్లి పత్రికలు కూడా అందరికీ పoచేసాం కదా, అయినా నా కూతురు కూడా ఇష్టపడాలి. ఇప్పటికిప్పుడు పెళ్ళికొడుకుని మార్చడం అంటే మాటలు కాదు. పైగా నేను మాట ఇచ్చిన వారికి ఏం సమాధానం చెప్పుకోవాలి వాళ్లను అవమానించినట్లు అవుతుంది . అంత సిద్ధమయ్యాక ఇప్పుడు నేను పెళ్లి కొడుకు ని మారిస్తే ఆ పిల్లాడికి ఇక జీవితంలో పెళ్లి అవుతుందా.
వారంతా ఆ అవమానం భరించలేక ఏదైనా చేసుకుంటే ఆ పాపం నాకే కదా . అయినా నాకు ఇలా చేయడం ఇష్టం లేదు నన్ను మన్నించండి మీ మాట నేను కాదంటున్నoదుకు నన్ను మన్నించండి. నా తల తాకట్టు పెట్టి అయినా సరే వచ్చే పంట పైన ఆయన మొత్తం బాకి తీర్చేస్తాను.
ఇప్పుడు ఈ పెళ్లి జరిగిపోనివ్వండి అయ్యా, భూషణ రావు గారు మన్నించండి. మీలాంటి గొప్ప సంబంధాన్ని వద్దనుకుంటున్నా అందుకు నన్ను మన్నించండి కానీ ఇప్పుడు అంతా సిద్ధమయ్యాం .
తర్వాత నేను ఏమి చేయలేను మార్చలేను. నాపై దయ ఉంచి ఈ ఒక్కసారి మీరు ఏమి అనుకోకుండ నేను వచ్చే పంట మీద మీ అప్పు ఎలాగైనా తీరుస్తాను అని అన్నారు మూర్తి గారు.
మూర్తి గారు అలా అంటారని ఊహించని భూషణ్ రావు గారు తాను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్టుగా ఏంటయ్యా నాగయ్య ఇది నాకు అంత కర్మ ఏం పట్టింది ఎదురు కట్నమిచ్చి మరీ ఆ అమ్మాయిని చేసుకునే అంత గతి నాకేం పట్టలేదు.
మా వాడికి సంబంధాలు వస్తున్నాయి, లక్షల కోట్ల కట్నం ఇస్తామంటూ క్యూలు కట్టారు . నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్లతో నేను వియ్యం ఎలా పొందుతాను అనుకున్నావు. మాట్లాడితే మాట ఏదైనా రీతి ఉండాలి.
ఏమనుకుంటున్నావ్ అయ్యా నన్ను నా ఇంటికి మీ పిల్లల్ని పంపు అని నేను అడుక్కోవాలా చూడు ఎలా మాట్లాడుతున్నాడో , నేనేదో అడుక్కునే వాడిలా ఆయన ఏదో పెద్ద నాకు ఇచ్చే వాడిలా, మాకు అంత కర్మ పట్టలేదు.
నా వంశం గొప్పది నా చరిత్ర గొప్పది నేను గొప్పవాడిని, నా కన్నా గొప్పవాడు సంబంధాన్ని నేను నా కొడుకుకు చేసుకుంటాను, ఇలాంటి అలాగా వాళ్ల తో సంబంధం కలుపుకుంటానా ఛి ఛి ఇంతకన్నా మంచి సంబంధాన్ని వెతుక్కుంటాను ,
వంశం చరిత్ర అని భూషణ్ రావు గారు అనగానే, మూర్తి గారికి కూడా కాస్త కోపం వచ్చింది. ఏంటండీ వంశం చరిత్ర అని అంటున్నారు. మా వంశానికి ఏమి తక్కువ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చాలా గొప్ప వంశం మాది.
మీలాగా అప్పిచ్చి రాసి రంపాన పెట్టే వాళ్ళం కాదు. నలుగురికి తిండి పెట్టే వాళ్ళం, నలుగురు బాగు కోరే వాళ్ళం, కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడండి. లేదంటే మరోలా ఉంటుంది అన్నారు మూర్తిగారు.
ఏంటోయ్ మర్యాద తప్పింది నీకు మర్యాద ఇవ్వడం ఏంటి, నా దగ్గర అప్పు తీసుకునినన్నే అంటావా ఇక నేను ఊరుకునేది లేదు. ఏదో మంచివాడు అని మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే తెగ రెచ్చిపోతున్నారు. నువ్వు ఇక్కడే ఉండు, డబ్బు ఎలా రాదో నేను చూస్తాను ,
రేయ్ ఎవర్రా అక్కడ ఇతన్ని తీసుకువెళ్లి కట్టేయండి. బాగా పెలుతున్నాడు. ఇప్పటివరకు ఎంతో మర్యాద ఇచ్చి మాట్లాడాను. కానీ మర్యాద తో మాట్లాడితే ఎవడు వినడు.
ఇక దెబ్బకు దెబ్బే మాటకు మాటే. వీడిని ఇక్కడే కట్టేసి అలా ఇంటి వాళ్లకు సమాచారం ఇవ్వండి. డబ్బు నడుచుకుంటూ వస్తుంది అన్నారు కోపంగా భూషణ్ రావు గారు.
భూషణ్ రావు గారి మాటలతో అయ్యో అనవసరంగా మాట జారీ నా తల మీదికి తెచ్చుకున్నాను. కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే బాగుండేది. ఇప్పుడు ఏం చేయాలి రా భగవంతుడా అని అనుకుంటూ మూర్తి గారు చేతులు తలపై పెట్టుకొని కింద కూలబడ్డారు.
*********
అమ్మా అనితమ్మ కొంప మునిగిపోయింది అమ్మ తొందరగా రండి అన్నా ఎక్కడున్నారు అంటూ గట్టిగా అరిచాడు నవీన్, నవీన్ ఇంట్లో చిన్నప్పటి నుంచి పెరిగాడు. మూర్తి గారి కుడిభుజం లాగా ఉంటాడు.ఏంట్రా కేకలు ఏంటి ఏమైంది ఎవరి కొంప మునిగిపోయింది రా అంటూ లోపలి నుంచి వచ్చింది మూర్తి గారి భార్య అనితమ్మ ,ఎవరితో అయితే నేను ఎందుకు అరుస్తారు అమ్మ మన కొంపే మునిగిపోయింది అన్నాడు నవీన్ కంగారుగా..
అతని మాటలు కేకలు విన్న కరుణ సుప్రజ మిగిలిన చుట్టాలు బయటికి వచ్చారు.ఒరేయ్ నవీన్ ముందు అరుపులు ఆపి ఏమైందో చెప్పరా నాకు చాలా కంగారుగా ఉంది ఇంతకీ అయ్యగారు ఎక్కడ అంటూ అడిగింది అనితమ్మ.
అమ్మ అయ్య గారిని భూషణం గారు తన ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పటికిప్పుడు 10 లక్షలు అప్పు కట్టమని అంటున్నారు. అప్పుడు కట్టకపోతే ఆయన్ని పంపించను అని భీష్మించుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఏం చేద్దాం అమ్మ అంటూ అడిగాడు నవీన్.
ఏంటి భూషణ్ అంత పని చేశాడా ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఇవ్వాలంటే ఎక్కడినుంచి ఇవ్వాలి. రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని అందరి ముందు పరువు పోతుంది ఇప్పుడు ఎలా ఏం చేద్దాం రా, అసలేం జరిగిందో చెప్పు అంటూ అడిగింది అనితమ్మ .
అంటే అమ్మ అది అంటూ చుట్టూ ఉన్నవారిని చూశాడు నవీన్, అది గమనించిన అనితమ్మ మీరంతా లోపలికి వెళ్ళకండి అంటూ చుట్టాలందరూ లోపలికి పంపించింది. దాంతో వాళ్లు లోపలికి వెళ్లిపోయారు కానీ కరుణ మాత్రం తలుపు వెనకాల నిలబడి వాళ్ళిద్దరు మాట్లాడుకునేది వింటున్నారు.
ఇప్పుడు చెప్పు నవీన్ అసలు ఏమైంది అంటూ అడిగింది అనితమ్మ. అమ్మ అయ్య గారిని భూషణం గారు ఇంటికి పిలిపించి బాకీ కట్టమని అడిగారు కానీ మూర్తి గారు కాస్త పెళ్లి ఉందని వేడుకొన్నారు.
అప్పుడు నక్కజిత్తుల నాగయ్య మన కరుణ అమ్మకు వాళ్ళ అబ్బాయికి పెళ్లి జరిపిస్తే బాకీ మాట మర్చిపోవచ్చు అని ఒక ఉపాయం చెప్పారు.
కానీ మన అయ్యగారు అందుకు ఒప్పుకోలేదు దాంతో భూషన్ రావు గారికి కోపం వచ్చి మీరు ఇక్కడే కూర్చుని డబ్బు ఎలా రాదో నేను చూస్తాను అంటూ మన అయ్యగారి అక్కడే కూర్చోబెట్టారు .
ఇప్పుడు డబ్బులు ఇచ్చే వరకు మన అయ్యగారిని బయటకు పంపించారు చుట్టూ తన మనుషులను కాపలా పెట్టాడు. నేను మీకు ఈ విషయం చెప్పాలని వచ్చాను ఇప్పుడు ఏం చేద్దాం అంటారు అంటూ అడిగాడు.
నన్ను అడిగితే నాకేం తెలుసు రా ఆలోచిద్దాం ఆగు అన్నీ అనితమ్మ. లోపలి నుంచి ఈ మాటలు అన్నీ వింటున్నా కరుణ సుప్రజ బిత్తరపోయారు. కరుణ అయితే శాఖ అయింది.
పని భూషన్ రావు కొడుకుతో పెళ్ళంటే పాము తో పెళ్లి అన్నమాటే , వాడు వాడి ఆకారం అం ఆశ్రయించుకుని కరుణ. ఛీ వాడితో పెళ్లి ఎవరైనా చేస్తాను కానీ వాడిని అస్సలు చేసుకోను అనుకుంది మనసులో…
కానీ తన తండ్రి అక్కడ చిక్కుకుపోయాడు ఇప్పుడు ఏం చేయాలి తన తండ్రి ని ఎలా విడిపించాలి. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు.
నాన్న తన పెళ్లి కోసం దాచిన డబ్బులు అన్నీ పెళ్లి కోసం ఖర్చు పెట్టారు ఇప్పుడు నాన్నగారి దగ్గర కూడా ఏమీ లేవు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అంటూ దీర్ఘం గా ఆలోచించసాగింది కరుణ.
*******
ఏమండోయ్ చాలా తాపీగా కూర్చున్నారు పెళ్లి వారి ఇంటి నుంచి ఇంకా ఎవరూ రాలేదు ఎల్లుండి పెళ్లి మనం ఈరోజు సాయంత్రం బయలుదేరితే రేపు పొద్దున చేరుతాం. అక్కడికి వెళ్లి అన్ని సర్దుకునే సరికి పెళ్లి సమయం ముంచుకు వస్తుంది అయినా మీరు ఇంత తాపీగా కూర్చున్నారు ఏంటి అన్నయ్య గారికి ఫోన్ చేయండి ఎవరు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అనేది తెలుసుకోండి అన్నది రాధమ్మ తన భర్త శంకర్ రావు గారితో ..
ఎందుకు తొందర మా మూర్తి గాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు నువ్వేం కంగారు పడకు వాడే ఫోన్ చేస్తానులే.
అసలే ఆడపిల్ల తండ్రి కదా వాడికి ఎన్ని పనులు ఉంటాయో , ఎంత హడావిడి పడుతున్నాడో , వాళ్ళు అన్నీ సిద్ధం చేసుకొని మనకు ఫోన్ చేస్తారు లే నువ్వేం బాధపడకు సమయానికి అన్నీ అవే జరిగిపోతాయి అన్నారు శంకర్రావు గారు నింపాదిగా..
ఆమెకు అన్నీ అలాగే ఉంటాయి మీరు మీ మిత్రుడు అంటే ప్రాణం ఇస్తారు అతని ఒక్క మాట కూడా ఇవ్వరు కదా అయినా వియ్యాలవారి గొప్పలు చూపించు కునేది ఈ సమయంలోనే అండి , పెళ్లి అయిన తర్వాత మనం ఏమి చూపించలేము.
ఎంత స్నేహితుడైన బియ్యం కూడా వియ్యంకుడి కదా , పెళ్ళికొడుకు తండ్రి హోదాలో మీ స్నేహితుడు అనే ఆట పట్టించండి. అంది నవ్వుతూ రాదమ్మా.
అదేంటో అలా అంటావు , ఇప్పుడంటే వియ్యంకుడు కాబోతున్నాడు ఏమో కానీ వాడు నా చిన్ననాటి మిత్రుడు కదా మేమిద్దరం ప్రాణస్నేహితులు వాడిని నేనే ఇస్తాను.
అసలే పిరికివాడు వాడిని నేను ఏమైనా అంటే మొహం వేలాడేసుకుo టాడు. అందుకే వాడిని నేను ఏమీ అనను చూద్దాం వాడు ఎవరిని పంపిస్తాడు తొందరపడితే ఇలా అంటూ తన భార్యకు చెప్పాడు శంకర్రావు గారు.
ఏంటో మీరు మీ స్నేహితులు మీ మాటలు నాకు ఏమీ అర్థం కావు మీ ప్రేమను కూడా సరే నాదే పోయింది ఎప్పుడు వెళ్దాం అంటే అప్పుడే రెడీగా ఉంటా నేను అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాధమ్మ. భార్య మాటలకు నవ్వుకున్నారు శంకర్రావు గారు.
*********
అమ్మ ఆలోచించండి అమ్మ ఏం చేద్దాం అంటావు ఇప్పుడు అంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్ చూస్తూ అడిగాడు నవీన్.
ఆలోచనల నుంచి తేరుకుంటూ అనితమ్మ ఇలా రా ఇప్పుడు ఇంట్లో ఒక్క పైసా లేదు ఏం చేద్దాం ఇప్పుడు ఎవరిని అడిగినా లాభం లేదు అంత డబ్బు ఇవ్వమంటే ఎవరు మాత్రం ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఇస్తారు. నాకేం చెయ్యాలో పాలుపోవడం లేదు రా అంటూ నవీన్ వైపు అర్థవంతంగా చూసింది అనిత మ్మ.
అమ్మ మీరు ఇలా అంటే ఎలా ఏదో ఒకటి ఆలోచించాలి కదా మన బంధువుల్లో చుట్టాల లో ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉన్నారా అన్నాడు నవీన్. అలా బంధువులను చుట్టాలని అడిగితే ఏం బావుంటుంది అందర్నీ పెళ్లి కి పిలిచి అడిగితే వింతగా విడ్డూరంగా చూస్తారు నలుగురిలో పరువు పోతుంది అవసరమా ఇంత పని చేస్తాడు అనుకోలేదు భూషన్ ఇలా చేశాడేంటి , అంది అమ్మ ఆలోచిస్తూ…
అవునమ్మా అసలు నాకు ఎప్పటినుంచో అనుమానం మన అమ్మాయి గారిని వాళ్ళ అబ్బాయికి చేసుకోవాలని ఇలా మెలిక పెట్టినట్టు ఉన్నాడు. అన్నాడు నవీన్.
అవునా వాడికి ఇంత చెడు బుద్ధి ఉందా అందుకే మనకు ఒప్పించాడా అంది ఆశ్చర్యంగా అనితమ్మ , అవునమ్మా అదే కారణం కావచ్చు వాడు రెండు మూడు సార్లు బజార్లో నన్ను ఆట పట్టించాడు అంటూ లోపలి నుంచి వచ్చింది కరుణ.
అవునా మరి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అంది తల్లి అనిత మ్మ , చెప్తే ఏం చేస్తారు అమ్మా నలుగురిలో పడుకోవడం తప్ప అందుకే ఏమీ అనకుండా మౌనంగా వచ్చేసాను.
వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా అడిగాడు కానీ నేను అందుకు ఒప్పుకోలేదు అలా ఒప్పుకోలేదని ఇలా చేసినట్టు ఉన్నాడు కరుణ.
ఏమోలే పాడు బుద్దులు సమయం వచ్చినప్పుడు ఇదిగో ఇలా బయటపడుతూ ఉంటాయి అసలు స్వరూపాలు. . ఛి ఛి ఏం మనుషులో ఏమో ఇష్టం లేకుండా ఎలా చేసుకుంటారు. అయినా అప్పు పెళ్లికి ముందు పెడతారా ఏంటి ఇప్పుడు ఎలా ఏం చేద్దాం అంది బేలగా అనితమ్మ.
తల్లి అలా బెంబేలు పడిపోవడం తండ్రి వాళ్ల దగ్గర చిక్కుకోవడం చూసిన కరుణ ఇదంతా తన వల్లనే కదా అని అనుకుంటూ పోనీ నేనే వెళ్లాలా , తన తండ్రిని పంపించమని అని వదిలేయమని భూషణ్ ని బ్రతిమాలాలా వెళితే అక్కడ ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఆలోచనలో పడింది కరుణ.
ఇంతకీ కరుణ ఏ నిర్ణయం తీసుకుంది భూషన్ రావు దగ్గరికి వెళ్లిందా లేదా , మూర్తి గారి కోసం ఎదురుచూస్తున్న శంకర్రావు దంపతులు ఏం చేశారు. వీళ్ల పెళ్లికి ఇన్ని అడ్డంకులు ఏంటి తెలుసుకోవాలంటే మీరు ఆగాల్సిందే.
-భవ్యచారు