ఉపాధ్యాయుడు
నిశీధి కప్పేసిన జ్ఞానాన్ని
అక్షర కాగడా వెలిగించి…
వెలికి తీసిన పురావస్తు పరిశోధకుడు
నాలో ముడి రాయిలా వున్న
శక్తి సామర్థ్యాలను సాన పట్టి……
వజ్రంలా వెలికి తీసిన విశ్వకర్మ
ఓం కారంతో మొదలు పెట్టి……
ఇంగితాన్ని, లోక జ్ఞానాన్ని, నీతి నిజాయితీ లతో పూర్తి చేసిన…..
స్ఫూర్తి ప్రదాత
బలపమనే ఆయుధాన్ని చ్చి….
పలకపై సమరం చేయిస్తూ……
విద్యను బోధించిన
అక్షర యోధుడు
బండ రాయి లాంటి వాడిని…….
చక్కని శిల్పంగా మార్చిన
శిల్పి
కర్పూరంలా కరిగిపోతూ…..
జ్ఞాన వెలుగులను ప్రసరింప జేసిన దివ్వె
బ్రతుకు పోరులో అహరహం నా కోసం
పరితపించిన……
ఉపాధ్యాయుడు
(ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో)
– రహీం పాషా