వెన్నెల దారి
వెన్నెల దారిలో నడవాలంటే
అందరికీ ఇష్టమే
పున్నమి వెన్నెల తోడుగా
హాయిగా కదులుతుంటే
తెలియని ఆనందంలో
తేలుతున్న ఊహాలోకంలో
చుక్కల దారిలో వెలుగుల
నీడలో తలపుల గుర్తులో
జ్ఞాపకాల తన్మయత్వం
దాగిన కావ్యమైన తరంగం
చల్లనికలువలనందనవనం
కలలవూసులహృదయంలో
నడయాడే అమృతమంత్రం
వెన్నెల దారిలో వెలుగు దివ్వెల ప్రయాణం
ఆహా అంతరిక్షపు అద్భుతమా చవిచూచే
అదృష్టమా……?
– జి జయ