ప్రసవ వేదన
అనంతసృష్టిలో ప్రతిసృష్టి లో భాగమే ప్రసవవేదన కాదా ఆ బాధ వర్ణనాతీతం!
అండపిండ బ్రహ్మాండoలో
రూపు నిచ్చి జీవాన్నివ్వడాకి
తల్లి పడే ప్రసవ వేదన
త్యాగానికి సాక్ష్యం!
మోయలేని భారాన్ని కడుపులో బరువుగా
గుండెలో నిండుగా పండంట్టి బిడ్డ కోసం!
మమతలు మలచి
అనుబంధానికి ఆదియై
నవ మాసాలు మోసి
నరక యాతనను సైతం
ఎదురుచూసినకలలరూపం
కళ్ళ ముందు కనబడేవరకు
ప్రసవ వేదనే !
వేదనను కూడా ఎంతో
సహనంతో భరించేది
పులకరించి, తొలకరించే
క్షణాల కోసం తపించే ఒకే
ఒక్కప్రాణంమాతృహృదయం మాత్రమే!
– జి జయ