భూమి గొడుగు ఓజోన్ పొర
(ఆధారం :గూగుల్)
*******
అతి నీలలోహిత కిరణాల (ultraviolet rays)
నుంచి భూమిని రక్షిణంచగ
ఓజోన్ పొర,భూమినించి 25 నుండి
45 కీ. మీ.వరకు గొడుగులా విస్తరించి
ఉన్నదని శాస్త్రజ్నుల అంచనా.
అది సృష్థి.
ఆ కిరణాలు భూమిని తాకిన జీవరాసి
మనుగడకు ముప్పు. కిరణజన్య
సంయోగక్రియ, స్థంభించిపోయి
మొక్కలు పెరగవు.కాన్సర్, కేటరాక్ట్ లాంటి
జబ్బులు వచ్చే అవకాశముందని
కనిపెట్టబడింది.
మనిషి తన మనుగడకు,సుఖం కోసం
ఎన్నో పరిశ్రమలు, నెలకొల్పుతూ రసాయన
ప్రయోగాలు చేస్తున్నాడు.ఫ్యాక్టరీ వ్యర్ధాలు,
వాహనాల కాలుష్యాలు పెరిగిపోయినాయి.
వాటివల్ల భూమి,గాలి కలుషితం
అయిపోతున్నాయి.అందువలన ఓజోన్
గొడుగికి రంధ్రం ఏర్పడిందని కనుగొన
బడింది.
ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జిల
వలన ఉత్పన్నమయ్యే క్లోరో ఫ్లోరో కార్బన్
ఓజోన్ విచ్చిన్నమౌటానికి కారణం అని
రసాయనిక శాస్త్రజ్నులు కనిపెట్టారు.
కాబట్టి,మనం కొంత సుఖాన్ని త్యాగం చేసి
ఎయిర్ కండిషనర్లు,ఫ్రిడ్జ్లువాడకం తగ్గించి
భూమికి గొడుగులాంటి ఓజోన్ పొరని,
అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించి
ఆరోగ్య కరమైన మానవాళి,జీవరాసి
మనుగడకు దోహద పడవచ్చు.
– రమణ బొమ్మకంటి