(ఆ) కలియుగపు మాట
మౌనాన్ని కప్పుకున్న నేలలా
ఒకడు బాధను కప్పుకుంటాడు
రగిలే ఆకలి అగ్నిని తనలోనే దాచుకుంటాడు
మనుషులంతా ఒక్కటే
మనసులే వేరయా!
మనుషులు పచ్చగానే ఉంటారు
మనసులే ఎండిన బావులు
నిర్జీవన వనంలో వర్షపుచుక్క
పచ్చదనానికో శ్వాస
మనసును తడిపే మానవత్వపు జల్లే జాడే లేకుండా ఉంది
హోదాల గోదాలో ఎడతెగని పోరులో
ఆఖరి వరకు తకరారు
ఇక సాటి మనిషిపై ప్రేమా దోమా జాన్తానై
ఇక్కడ దోస్తీ కన్నా దుష్మనీకే విలువెక్కువ
ఎవడాకలికి వాడే బాధ్యుడు
ఇక్కడ ఎవడాకలి మంటను వాడే ఆర్పుకోవాలి
ఇదే ‘కలిపురుషుడి’ చాటు పద్యం
చాటే సత్యం కూడా
– సి. యస్. రాంబాబు