నేటి సమాజంలో పెళ్లి

నేటి సమాజంలో పెళ్లి

నేటి సమాజంలో పెళ్లి అనేది
అంతు లేని తంతు గా తయారయ్యింది.
ముందు తరం పెళ్లిళ్ల తో
పోల్చుకుంటే నేటిసమాజపు
పెళ్లిళ్లు విలువలు, ఆచరణ,
అవగాహన భిన్నంగా ఉంటున్నవి .
పెళ్లి అంటే ఇద్దరి మనస్సు ల కలయికతో ప్రారంభ మయ్యి కుటుంబ వ్యవస్థ,
సామాజిక భద్రత, మరియు
సమాజపుభాద్యత వరకు
కొనసాగే ప్రక్రియ.
అందులో భాగంగానే పెళ్లి
అనే అపురూప ఘట్టంలో
కుటుంబ సహకారం, ఆత్మీయుల,

బంధువుల మధురమైన అనుభూతుల మధ్య, ఆనందాన్ని ఆస్వాదిస్తూ సాగే పెద్ద వేడుక.
నేటి సమాజంలో పెళ్లి ప్రాధాన్యత వైవిధ్యంగా
జరుగుతున్నాయి. భవిష్యత్తు రూపకల్పన,
ఒప్పందాల ప్రకారం ఆర్థిక
స్థోమత లు ప్రాతిపదికలు
గా నిలుస్తున్నాయి.
కానీ పెళ్లి తమదైన శైలిలో
విభిన్నంగా , ఆడంబరంగా
జరిపిస్తున్నారు కొందరు
శక్తికి మించిన స్థాయిలో, గుర్తింపుకోసంపెళ్లివేడుకను, వేదికగా చేస్తున్నారు.
సంస్కృతి ఆచారాల కన్నా
ప్రచార ఆర్భాటం వ్యాపార దోరణిలో కొనసాగుతున్న
విషయం గా మారుతుంది.
నేటి సమాజంలో పెళ్లి
“స్టేటస్ సింబల్” గా పరిగణిస్తున్నారు. ఇటువంటి పరిణామాలు
సామాన్యులకు అందని ద్రాక్ష వలె ఉంటున్నవి.
మనిషిఎంతఎత్తుకుఎదిగినా ఆధునికత సంతరించుకున్న ను ఒక్క ముక్కలో చెప్పాలంటే
గుర్తింపుకోసంపాకులాడుతూ ప్రచార ఆర్భాట వేదికగా
మారుతుంది పెళ్లి తంతు
నేటి సమాజంలో…….?

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *