భయంకరమైన నిజం
అతి భయంకర నిజం ఏమిటి అంటే
మనిషి మరణిస్తాడు అని తెలిసి జీవించడం.
మనిషికివిచిత్రమైన
శాపం
తప్పించుకోలేని నిజం
ఆపలేని కర్మము
కరిగిపోతున్న వయస్సు
మారిపోతున్న కాలం
తీరని రుణం
జ్ఞాపకాల పొరలు
విలువైన సమయం
బంధాల బంధీలుగా
సృష్టించిన సృష్టిలో
మనసు పలికే మారణహోమం
శత వసంతాల సంబరం
ముగుస్తుంది అని తెలిసికూడా నమ్మలేని
భయంకర నిజాన్ని నిర్భయంగా నిరీక్షిస్తూ
చిరాయువులుగా కాకుండా
చిరస్మరణీయు లుగా మిగులుతారు. ఇదే సృష్టి లో
భయంకర మైన అతి పెద్ద
నిజం……..?
– జి జయ