అవని
అవని పొరల్లోఅంకురించిన
ధాన్యము ఆహారమై
జీవనానికి సాక్షీభూతము
అదిఒక పంచభూతము
అవనివొడిలోసేద తీరుతారు
అందరు.
ఆరాధించిన మనకిచ్చును
అద్భుత ఫలాలు
అవని లోనే పులకరించే
ప్రకృతి సంపద
అదే మానవుని మనుగడ
జీవరాశి పోషణే నీ భారం
ఓర్పుతో మోసేటి గొప్పతనం
అంతు లేని సంపదలు
అందించే సామర్థ్యం
నీ గర్భం.
అన్నీఇమిడిఉన్నరహస్యము
నీ సొంతం.
నీతో ముడివడిన ఈబంధం
గడ్డి పరక అయినా గతించిన కాలమైనా
అన్నీనీ చెంతకుచేరాల్సిన దే
అదేఅవని అనంత శక్తి……?
– జి జయ