మనిషి

మనిషి

నీవు సంఘ జీవివి
నీ పాత్ర “మనీషి” లా
ఉండాలి సమాజంలో….

కానీ!

నీవుస్వార్థం నింపుకుని
నాకుటుంబం ,భార్య ,పిల్లలు
అంటూ కూడగట్టే పనిలో
పడి, అవినీతి పరుడు గా
మారి సమాజానికి భారంగా
పీడకుడువైనావు….

అంతటితో నీవు ఆగవుగా
అవినీతి సామ్రాజ్యకుడైన
వెంటనే నీకుటుంబంతో పాటు
నీకులం గుర్తుచేసుకుంటావు…
సామాజిక జీవిగా విచ్ఛినకర
ధోరణి మంచిది కాదని విస్మరిస్తవ్….

సమాజ ఐక్యతను విష్మరించి
కులకుంపట్లు రాజేస్తావు…..
అవినీతి సొమ్ము వెదజల్లి ఎదుటవారి పై దాడులతో
విరగబడి పైచాసికాందాన్ని
పొందుతున్నావ్…..

ఇక నీకు మానసిక సమస్య
ఉత్పన్నమై ,పాపభీతి తో
కొట్టి మిట్టాడుతున్నావ్.
వెంటనే మదిలో నీఆలోచనులు
తొలగింపునకు మతం-దేవుడు
ని ఎంచు కుంటావు. అచ్ఛట
కూడా సక్రమంగా వ్యవహరించలేవు. కారణం
నీవు స్వార్థం తో నిండిపోయావ్…..

దేవుడు ని నీ కోర్కెలు తీర్చే
యంత్రం గా మార్చేసావు. నీ
భయం భీతి పోగొట్టుకొనుట
కు ఏమీ కోరని దేవుణ్ణి కూడా
లంచగొండిగా మార్చేస్తావు…
నీ మనస్సు లో నిభిడీకృతమైన
దృష్టకోర్కెలు తీర్చుకొనుటకు
దేవుణ్ణి వంకగా వాడుకునే
నీచమనస్కుడవైపోతావు….

ఇక అంతటితో ఆగవుగా “మతం” నుండి మానత్వంను
తీసుకోవలసిన నీవు,తద్వారా
సమాజ హితం కోరాల్సిన నీవు,
మతం పేర సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ,హించను ప్రేరేపించి పైచాసికాందాన్ని
పొందుతున్నావు…..

కారణం స్వార్థం, ఆలోచన
సరళి. మారాలని సమాజంలో
నీ పాత్ర అమోఘమైనదని నీవు
గుర్తించే లోపు అనేక అనర్ధాలతో సమాజం నిండిపోతోంది….

వివేకానందుడు ,రవీంద్రుడు మాటలను అద్యనం తో గ్రహించి సమాజం హితం కోరి,
సమాజ శ్రేయస్సు, అభివృద్ధిని
చేపట్టి, సమాజంలో అందరినీ
ప్రేమించే మనస్కుడవై “మనీషి”వై
సమాజంలో నీ పాత్ర కు
న్యాయం చేయ్…..

– విశ్వనాథ్.యన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *