మనిషి మనసు
మనిషి మనసు విచిత్రమైన
వింత కోరికల సందడి చేస్తూ
పయనించేదూరాలదారులు
వేస్తూ పరుగెత్తుకుంటూ వెళుతూ ఉంటే
గుప్పెడు మనసు కి గూడుకట్టుకుని
ప్రేమలు కావాలని …..
వూహల్లో తిరుగుతూ
కలలు కంటూ……
కదిలిస్తూకుదురులేక …పరిగెడుతుంది ఆలోచనలు రప్పిస్తుంది……
ఆవేదన కలిగిస్తుంది …
ఆనందాలు వెతుకుతూ …
వెలుగులునింపుతూ కబుర్లుచెబుతుంది …
తెలియని దానికి పోటీ పడుతూ ……
తెలుసుకోవాల్సిన ది ఎంత
సంతోషాన్నికోరుతూ ….
సమయాన్ని వృధా చేస్తూ
దూరాలను కలుపుతూ
తీరాలను చేరుతూ…
గమ్యాలను చేరుతూ …
లక్ష్యాలను చెపుతూ….
భయాన్ని నింపుతూ….
దైర్యాన్ని కనబరుస్తూ…..
ప్రత్యేకతను చాటుతూ….
పరిమళాలను నింపుతూ…
సంబంధాలను పట్టుకుంటూ ….
ఆశను రేకెత్తి స్తూ ….
తేడాలను గుర్తిస్తూ …..
కర్మలను గుర్తు చేస్తూ ….
కావలసినది పట్టుకుంటూ
నిన్నటి నీ మరుస్తూ…..
నేటి లో జీవిస్తూ…..
రేపటి వేచి చూస్తూ…..
తెల్లకాగితంలా మిగులుతూ
వున్నది లేనట్టుగా…..
లేనిది కానట్టుగా ….
చైతన్యం నీ వంతుగా…..
నిను వీడని శ్వాసను నింపు
కుంటూ మనిషి మనసు
“వాయువేగంతో”పయనిస్తూ
రంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది……..?
– జి జయ