కులం – వర్ణం
ఇవి మన దేశంలో
ఎప్పుడో వేల సంవత్సరాల ముందు జరిగిన కాలం,
చదివిన వేదం(ఋగ్వేదం) లో మొదలయి ఇప్పటికీ పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్య…
పారిశ్రామికంగా, వైజ్ఞానికంగా ఎంతో ప్రగతిని సాధించిన
మన దేశం లో కుల వివక్ష తను అదికమించడం లో మాత్రం చాలా వెనకబడిపోయాం…
ఈ కులం అనేది రాజకీయాలను శాసిస్తుంది..
విద్యాలయాలను ప్రాభావితం చేస్తుంది..
మానవత్వాన్ని చంపేస్తుంది..
విలువలను కాల రాస్తుంది..
మనిషిని సంస్కరించే మరే ఇతర నైపుణ్యాన్ని ఎదగనివ్వలేదు..
వైజ్ఞానిక సాంకేతిక పురోగతి సాధించే ఎన్నో రకాల పనులకు అడ్డంకి గాను మారుతుంది…
కారణం ఇప్పటికీ కులం కొమ్ములు పట్టుకుని కూర్చునే ఎంతో మంది ఇలా చెప్పుకుంటూ పోతే …
ఈ కులం పేరిట జరిగిన అక్రమాలు దేవాలయాల నుండి వెలివేత,
విద్యాలయం నుండి బహిష్కరణ ఇలా సమాజం తో పాటు కలిసి జీవించడానికి
వీలులేని మరెన్నో హక్కులను దారిద్ర్యపు రేఖకి దిగువన పడి నలిగిన
ఎన్నో వర్గాలు నేటికీ ఈ వివక్ష తో వెనుకబడే ఉన్నాయి….
ఈ కులం ముసుగులో పడి మనసు పెట్టీ ఆలోచించే నైపుణ్యాన్ని కోల్పోయాం,
విచక్షణ లేకుండా జీవిస్తున్నాం….
ఎన్నటికీ మారునో ఈ గతి, మరితేనె సాధించును ప్రగతి
– కుమార్ రాజా