ప్రేమ పెళ్లిళ్లు

ప్రేమ పెళ్లిళ్లు

ప్రేమ పెళ్ళిళ్ళలో ప్రేమ స్థానం విలువ చెప్పలేము కాని దాని అర్దం, సార్థకత ఏమిటి
అనిఅందరూతెలుసు కోవాలి.

పెళ్లి అంటే రెండు జీవితాల సంగమం ఇంకా రెండు మనసుల కలియిక రెండు
కుటుంబాల వేదిక .

కాని ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు
సమాజంలో కుటుంబంలో
అఘాధాలు సృష్టిస్తున్నాయి
అన్ని ప్రేమ వివాహాలు కాదు
కొన్ని కొంత మంది జీవితాల్లో
మాత్రమే .

పెళ్లి అంటే వేసుకొనే బట్టలు కావు కొనేసుకునే వస్తువు కాదు. కట్టే ఇల్లు కాదు
బట్టలు రోజూ మారుస్తాం
వస్తువులు కొంటారు అమ్ముతారు ఇల్లుని మార్పులు చేర్పులతో రూపు మార్చవచ్చు కానివివాహము
అలాకాదుకదా
ఆజన్మాంతం ప్రేమతో ముడిపడిన పరుగు పందెం

ప్రేమ పెళ్ళిళ్ళలో ఎన్నో అడ్డు
గోడలు కారణమవుతాయి
అందులో
ఇష్టమైన వ్యక్తుల కోసం
కుటుంబాల కోసం
కులాల కోసం
మతాల కోసం
ఉద్యాగాల కోసం
వృతుల కోసం
డబ్బుకోసం
స్వార్థం కోసం
మోహం కోసం
సమాజం కోసం
జాతకాల కోసం
భావాల కోసం
భవిష్యత్తు కోసం
సహాయం కోసం
అందం కోసం
విలువల కోసం
ఇలా ఎన్నో రకాల ప్రేమ పెళ్లిళ్లకు కారణాలు అనేకం
కాని ఎక్కువ శాతం ప్రేమ పెళ్లిళ్లు కల కాలం నిలవడం లేదు .

ఇద్దరి అపరిచిత వ్యక్తులు
సుపరిచితులు గా ప్రేమ పెళ్లి
పేరుతో జీవితాలుకొత్తమలుపు తిరుగుతుంది వారి కలల
వారధులు కట్టుకుంటారు
ఊహలకు జీవం పోసి రూపు నిస్తారు . పెద్దల తల్లితండ్రుల సహకారంతో
ముడి పడి జీవితాన్ని ఆనందంగాఅనుభవించాలని ప్రణాళికతో ముందుకెళ్ళి
నిలబెట్టు కుంటారు కొంతమంది. ఎలాంటి ప్రేమ వివాహాలుసాఫీగాసాగుతాయి.

కొన్ని ప్రేమ పెళ్లిళ్లు మాత్రంవిరుద్ధంగా వుంటాయి

ప్రేమ అనేది నిప్పు లాంటిది
అమాయకులుఅనవసరంగాబలిఅవుతున్నారు
కొన్ని సందర్భాల్లో హత్యలకు
ఆత్మ హత్యలకు దారితీసి
ఎన్నో జీవితాలు నాశనానికి
కారణమవుతున్నాయి
మేక వన్నె పులులుగా వుండకుండా నిజాయితీగా
నిలిచి జీవితాన్ని పొందాలి
” సరియైన విద్య, బుద్ది, జ్ఞానం, అవగాహన , కుటుంబ సభ్యుల తోడ్పాటు
కాళ్ళ మీద నిలబడే శక్తి ,
ఆలోచనలు, లక్ష్యాలు,
అన్నింటినీ ద్వారా అద్భుత మైన విజయాలు జీవితం
సాధించాలి . కాని నిండు
నూరేళ్ళ జీవితాన్ని అనవసరంగా వ్యర్దం చేయకూడదు. …….

– జి జయ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *