ఎదురీత
మనసుకు నచ్చిన పని చేస్తూ , మనసును ఎప్పుడూ ఆనందంగా ఉంచుకుంటూ కష్టాలకు నష్టాలకు ఎదురు వెళుతూ చిరునవ్వుతో బ్రతుకు బండిని సాగిస్తూ ముందుకు సాగడమే జీవిత లక్ష్యం. నువ్వే కాకుండా నీలాంటి ఇంకొక నలుగురికి కూడా నువ్వు ఆదర్శంగా నిలిచిన నాడు మీ జన్మ ధన్యం అవుతుంది. కష్టసుఖాలు ఎక్కడో వస్తూ పోతూ ఉంటాయి అలాగే స్వర్గ నరకాలు కూడా మనలోనే ఉంటాయి మనం వాటికి భయపడుతూ ,బతుకు భారం అనుకోకుండా , ఎప్పుడైతే చిరునవ్వుతో జీవితానికి ఎదురు వెళ్తాము అప్పుడే మనల్ని చూసి నవ్విన వాళ్ళు మన విజయాన్ని చూసి ఏడుస్తూ ఉంటారో అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలం చిన్న చిన్న విషయాలకు బాధపడుతూ ఏడుస్తూ అయ్యిందని అనుకుంటూ జీవితాన్ని చాలింక్చకుండా నలుగురికి ఆదర్శంగా నిలిచి కష్టాలను ఇష్టాలుగా మార్చుకుని మన బతుకును మనమే స్వర్గంగా మార్చుకుంటామో అప్పుడే మనం ప్రతి కష్టం పై విజయం సాధించినట్టు అవుతుంది అందుకే కష్టాలు వచ్చాయని బాధపడుతూ కూర్చుంటే అది నరకంగా ఉంటుంది అవే కష్టాలను ఇష్టాలుగా మలుచుకుంటూ ముందుకు సాగడమే మన జీవిత లక్ష్యం, ధ్యేయం .
-ప్రణవ్