స్వర్గం – నరకం

స్వర్గం – నరకం

స్వర్గం నరకం ఎక్కడో లేవు. మన జీవితంలో అన్ని అనుభవాలు ఆ సమయానికి స్వర్గ నరకాలు గా అనిపిస్తాయి. మనసు బాగుంటే అది స్వర్గంలా లేకపోతే నరకంలా ఉంటుంది. అసలు మనసు ఎప్పుడు బాగుంటుంది? ఎందుకు బాగుంటుంది? అసలు మనసు అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?

మనసుకు మనకు సంబంధం ఏమిటి? మనసుకు రంగు, రుచి, వాసన ఉంటాయా? అది మన శరీరం లో ఒక భాగమేనా? ఇలాంటి చాలా సందేహాలు అందరికీ ఒక్కొక్కసారి తెలుసుకోవాలి అని అనిపించక మానదు. అయితే వీటన్నిటికీ సమాధానం అయితే నాకు తెలియదు.

కానీ నేను అనుకున్నది నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు సమాధానాలు చెప్తాను. అందులో ఎక్కువగా అవును అని అంటే మీరు మీ మనసు బాగున్నట్టే… లేదంటే మీ మనసు బాగా లేనట్టే…. సరే ఇక ప్రశ్నలు చూద్దాం

1. మీరు మీ జీవితం లో కోరుకున్న చదువు చదివారు.
2. మీరు అనుకున్నట్టే ఉద్యోగం చేస్తున్నారు.
3. మీరు అనుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.
4. మీరు అనుకున్నట్టే ప్రమోషన్ వచ్చింది.
5. మీరు మీ జీవితం లో అన్ని అనుకున్నట్టే జరిగాయి.

పై అయిదు ప్రశ్నలు మీ సమాధానం అవును అయితే మీ మనసు బాగునట్టె, ఇక దీనికి సమాధానాలు కింద ఇస్తున్నా ఇక్కడ కూడా మీ సమాధానం అవును అయితే మీరు బాగా లేనట్టు, కాదు అని సమాధానం వస్తే మీరు సంతోషంగా ఉన్నట్టు.

1. కోరుకున్నట్లు చదువు చదువుకోలేదు.
2. అనుకున్న లక్ష్యం చేరలేదు. ఉద్యోగం చేయడం లేదు.
3. ప్రేమించిన లేదా అనుకున్న వ్యక్తిని పొందలేక పోయారు.
4. మీరు అనుకున్నట్టు మీకు ప్రమోషన్ రాలేదు. వేరే ఎవరికో వచ్చింది.
5. మీరు మీ జీవితంలో అనుకున్నవి ఏవి పొందలేక పోయారు.

పై సమాధానం లో చెప్పినట్టు అవును అంటే మీరు మీ మనసు బాగా లేనట్టే, ఇక మనసుకు రంగు, రుచి వాసన ఏమి లేవు. అదెప్పుడు మామూలుగా ఉంటుంది. అది మన శరీరంలో ఒక అవయవం అనుకుంటే ఒక అవయవమే కాకపోతే ఆది కంటికి కనిపించేది కాదు.

కాబట్టి మనం దాన్ని చూడలేము అంటే అందుకే కొందరు మనసు బాగాలేదు అంటే ఏది చూపించు అంటారు ఎగతాళి చేస్తారు. నిజానికి మనసు బాగా లేదు అని ఎప్పుడు అంటాం అంటే మనం అనుకున్నవి జరగనప్పుడు, మన చేతుల్లో ఏమీ లేనప్పుడు, జీవితం లో కొరుకున్నవి రానప్పుడు మనసు బాగాలేదు అంటాము.

అవును మనం అనుకున్నట్టు అన్నీ జరిగితే స్వర్గంగా భావిస్తూ మనం సంతోషంగా ఉంటూ, మన పక్కన ఉన్నవారిని కూడా సంతోష పడేలా చేస్తాం. అదే మనం అనుకున్నట్టు ఏమి జరగక పోతే అది నరకంగా భావిస్తూ మనం బాధ పడుతూ పక్కవారికి కూడా బాధను పంచుతూ ఉంటాం. ఇవే స్వర్గ నరకాలు.

ఈ మనసు బాగా లేకపోతే మనం మన జీవితంలో కోరేది ఏమి జరగనప్పుడు, కోరుకున్నవి రానప్పుడు, దక్కనప్పుడు మన బతుకు భారం అయినప్పుడు అంటే జీవితంలో అనుకున్నట్టు అంటే చదువు, ఉద్యోగం, పెళ్లి లాంటివి జరగనప్పుడు, అనుకోని బాధ్యతలు మీద పడ్డప్పుడు, ఇలాంటి బతుకు మనకొద్దురా భగవంతుడా అని అనిపిస్తుంది.

అనుకోకుండా జరిగేవే జీవితం అని అప్పుడు అర్థమవుతుంది. కక్కలేక మింగలేక ఎవరికీ చెప్పుకోలేక చెప్పుకున్నా ఓదార్పు పొందలేక బతుకు భారమైన జీవితాలు ఎన్నో ఇలా జీవితంలో అనుకున్నది కానప్పుడు, చేరుకుంటాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేనప్పుడు, అనుకున్న విజయం సాధించలేనప్పుడు బతుకు చాలా భారంగా అనిపించవచ్చు ఉదాహరణకి ఒక వ్యక్తిని తీసుకుందాం.

ఇద్దరు భార్య భర్తలు తమ ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నదాంట్లో తింటూ పిల్లల్ని చదివించుకుని హ్యాపీ గా ఉంటున్న సమయంలో హఠాత్తుగా ఆ భార్యా భర్తల్లో భర్త కి అనుకోని రీతిలో ప్రమాదం జరిగి ఒక కాలు విరిగిపోతే అప్పుడు ఆ భార్య పరిస్థితి ఎలా ఉంటుంది?

తన భర్తని చూసుకోవాలి. అటు చిన్నవాల్లైన పిల్లల్ని, ఇంటి ని అలాగే సంపాదన కోసం ఉద్యోగం నిర్వర్తించాల్సి ఉంటుంది. అలా ఉద్యోగం నిర్వర్తిస్తూ, భర్తను పిల్లలను ఇంటిని చూసుకునే ఆ వ్యక్తికి ఒక్కోసారి నిరాశ నిస్పృహలకు లోనై బతుకు భారంగా అనిపిస్తుంది.

ధైర్యం చెప్పే వాళ్ళు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో అటు మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోయిన పరిస్థితిలో ఆమె ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. అందర్నీ చంపి ఆమె చనిపోవచ్చు లేదా ఆ కుటుంబాన్ని వదిలేసి తాను పారిపోవచ్చు.

ఎందుకంటే అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన తమ జీవితాన్ని ఒక్క సారిగా ఒక ప్రమాదం రూపంలో ముంచుకొచ్చిన విషయాన్ని తట్టుకోలేక ఏం చేయాలో, ఎలా ముందుకు వెళ్లాలో ఎవరు చెప్పక, ఎవరూ ధైర్యాన్ని ఇవ్వని స్థితిలో ఆమె కానీ అతను కానీ ఇలాంటి ఆలోచన చేయవచ్చు లేదా నిర్ణయం తీసుకోవచ్చు.

ఒకానొక సందర్భంలో తన మనస్సు రాయి చేసుకుని విధికి ఎదురీదాలి అని అనుకుంటే ఆమె సంతోషంగా తన బాధ్యతలను తనవే అని అనుకుంటే ధైర్యం చెప్పే వారు ఎవరూ లేకపోయినా, వెన్ను దన్నుగా నిలిచేవారు రాకపోయినా తన పిల్లలే తన లోకం అనుకుంటూ విధికి ఎదురీది మరి జీవితాన్ని బతుకును కొనసాగించవచ్చు.

ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలని అనుకుంటే తన ముగ్గురు పిల్లలను చూసుకుంటూ ఉద్యోగాన్ని ఇంటిని చక్కగా నిర్వహిస్తూ, తాను సంతోషంగా ఉంటూ తన వాళ్ళని సంతోష పరచవచ్చు. అది ఎప్పుడు జరుగుతుందంటే ఇది నాది అని అనుకున్నప్పుడు వీళ్లకు నేను తప్ప ఇంకెవరూ లేరు అని భావించినప్పుడు ఇలా జరుగుతుంది కానీ ఇదేం జీవితం అని అనుకుంటే మాత్రం బతుకు భారం అవుతుంది. 

అయితే ఇలాంటి సమస్యలన్నిటిని చిరునవ్వుతో ఎదుర్కొంటూ ముందుకు సాగడమే జీవితం. అప్పుడే జీవితం రంగులమయం అవుతుంది. ఆమె తనకే కాకుండా తన పిల్లలకు తన చుట్టు ప్రక్కల వారికి ఆదర్శంగా నిలుస్తుంది.

భర్తకు ప్రమాదంలో కాలు పోయినా తన జీవితాన్ని తన పిల్లల జీవితాన్ని చక్కదిద్దాలని ఆశా కోరిక బలంగా ఉన్నప్పుడు తనని ఎవరు పట్టించుకోకపోయినా ఎవరు ధైర్యం చెప్ప లేకపోయినా తనకు తానే ధైర్యం చెప్పుకొని, తన ఆశ కోరిక బలంగా ఉన్నప్పుడు తన పెదవులపై చిరునవ్వు విరిసి కష్టాలకు ముందుకు సాగడమే జీవిత లక్ష్యం అవుతుంది.

అలాంటి వారి మొహాల పై మనం ఎప్పటికీ చెరగని చిరునవ్వుని చూస్తాం. వారు వారే కాకుండా పది మందికి ఆదర్శంగా నిలుస్తారు అలాగే తమ పిల్లల్ని కూడా చాలా చక్కగా పెంచుతారు. సామాజికంగా ఆర్థికంగా కాస్త కుదుట పడ్డాక కూడా వాళ్ళు ఇంకా ఎవరికైనా సాయం అందించాలని అనుకుంటారు. అందిస్తారు కూడా అలాంటి వారిని చూసినప్పుడు మన పెదవులపై కూడా చిరునవ్వు అనేది మొలుస్తుంది. వారి ధైర్యాన్ని మనం మెచ్చుకో లేకుండా ఉండలేం.

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *