ఆహా విరులదేమి భాగ్యమో?
నిన్నే తలచీ,
నిత్యము కొలిచీ,
మనమున నింపి,
తనువును వంచి,
కరములు జోడి,
నీ పదముల బడి,
దినమున వేడి,
పాటలు పాడి,
ఇంతయు కొంతయై,
తామెట వచ్చెనో గాని,
విరులే,
తమ వీరులైరి,
హరి దరి కెగరగ,
రంగుల మాలగ,
తనువంతా నిండగ,
నఖశిఖ పర్యంతం
నీతో చేరిన
ఆ విరులదేమి భాగ్యమో?
రామా!
నీ అడుగుల అడుగున
నన్నూ ఓ విరిగా పుట్టించవూ?
– సత్యసాయి బృందావనం