కాలం నేర్పిన పాఠం

కాలం నేర్పిన పాఠం

పొద్దున్నే లేచాను కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని , స్టవ్ పై ఓవైపు బియ్యం మరోవైపు టీ పెట్టుకున్నాను. మరోవైపు ఈరోజు ఏం కూర చేయాలా అని ఆలోచించి ఆ కూరగాయలు కోసుకోవడం మొదలుపెట్టాను. ఈ లోపు పూర్తి అయింది తీసుకొని గ్లాసులో పోసుకొని రెండే బుక్కల్లో తాగేసి గబగబా కూర పొయ్యిమీద వేశాను.

ఇంతలో అన్న మయింది అన్నం తీసి కంచంలో పెట్టాను. ఆ పక్కనే పొయ్యిమీద మళ్ళీ ఇడ్లీ కోసం మాత్రమే పెట్టి ఇడ్లీలు వేసాను. కూర కూడా అయిపోగానే కూర దించి పక్కన పెట్టి కొబ్బరి టమాట అన్ని వేసి పక్కన పెట్టి ఉన్నాను.

ఇదిలా ఉంటె ఇద్దరు పిల్లలు లేచి, మమ్మీ అంటూ వచ్చారు బాత్ రూం లోకి తీసుకెళ్లి 12 కి కడిగేసి వచ్చాను తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాను. మళ్లీ వంట ఇంట్లోకి వచ్చి కుస్తీ పడుతున్నాను.

పిల్లలిద్దరూ మొహం కడుక్కుంటూ, ఆడుకుంటూ ఒకరిపై ఒకరు పేస్టు పూసుకున్నారు వెళ్లి చూసి వాళ్ళిద్దర్నీ రెండు దెబ్బలు వేసి కడిగి తీసుకువచ్చి. చెరో గ్లాసులో పాలు పోశాను. వారవి తాగుతుండగా మిక్సీలో చెట్నీ వేశాను.

ఆ శబ్దానికి నిద్ర లేచిన మా వారు లేచి పొద్దునే వెధవ సంత హాయిగా నిద్రపోనివ్వదు అంటూ విసుక్కుంటూనే బాత్రూంలోకి వెళ్లారు అప్పటికి సమయం 8 గంటలు. గబగబా ఆయనకు వేడి నీళ్లు, బ్రష్ మీద పేస్ట్ వేసి రెడీగా పెట్టాను.

బయటకు వచ్చి ఎం టిఫిన్ చేసావ్ అని చిరాకుగా అడిగాడు ఇడ్లీ అంటూ చెప్పాను. నీ బొంద నీకు అది తప్ప ఇంకేం చేయడం రాదా హాయిగా ఏ పూరో, వడో చెయ్యవచ్చు కదా అంటూ గొణుగుతూ మొహం కడుక్కుని నా చేతిలో ఉన్న టవల్ లాగేసుకున్నారు.

ఇంతలో పిల్లలు అమ్మా స్నానాలు అంటూ అరిచేసరికి పిల్లలకి స్థానాలు చేయించాను. అక్కడే ఏడుస్తావా ఇక్కడ ఏమైనా పెట్టేది ఉందా అంటూ శ్రీవారి గర్జన వినిపించేసరికి పిల్లలకు ఆయనకు ప్లేట్లలో ఇడ్లీలు చట్నీలు వేసి ఇచ్చాను.

పిల్లలు ఇద్దరు తినమంటూ మారాం చేస్తుంటే ఎలాగో వాళ్ళకి తినిపించాను శ్రీ వారు కూడా 2 ఇడ్లీలు తిని పక్కన పడేశారు. ఆ సంఘటనతో మనసు చివుక్కుమంది కష్టపడి పొద్దున్నే చేస్తే కనీసం బావుంది అనకుండా పక్కన పడేశారు అని ఒక భాధ నన్ను ఆవరించింది.

ఆ బాధలో ఉండగానే ఆటోవాడి పిలుపు పిల్లలకు సమయమైంది అంటూ. తమ తమ పిల్లల్ని ఆటో దగ్గరకు తీసుకెళ్లి కూర్చోబెట్టి జాగ్రత్తలు చెప్పి పంపాను. లోపల్నుంచి అరుపులు ఇంకా బయట ఎంతసేపు ఉంటావు ఎక్కడ ఎక్కడ అంటూ గట్టిగా అరుపులు బయటకు వినిపిస్తే నవ్వుకుంటారని సిగ్గుతో లోపలికి నడిచాను.

శ్రీవారికి బట్టలు బెల్టు బాక్స్ అన్ని అందించాను. అన్ని రెడీగా పెట్టుకోలేవు ఇంట్లో ఉండి పీకి పడగొట్టేదేముంది అంటూ ఆయన చిరాకు పడుతూనే బయటకు వెళ్లిపోయారు.

ఆయన వెళ్లిన తర్వాత అయ్యో బాక్స్ అని గుర్తుకు వచ్చి బయటికి వెళ్లి ఏమండీ అని పిలిచాను ఏంటి అన్నట్టు చూశారు బాక్స్ అన్న నేను వద్దులే నీ బోడి బాక్స్ ఎవడికి కావాలి బయట తింటాలే అంటూ బైక్ ఎక్కి అన్నారు.

ఆ మాటతో ఇంకా మనసు బాధ గా మారింది ప్రొద్దున లేచి ఇంటి పనులు చేస్తున్నా కనీసం సహాయపడే ఒక్క మాట కూడా నాకు ఎవరు ఇవ్వలేదు పోనీలే మా వాళ్లే కదా ఏదో చిరాకు లో ఉండి ఉంటారు నేను పిల్లలు అయన విడిచిన బట్టలు అన్నీ ఉతికి ఆరేసి మళ్ళీ ఒకసారి ఏమైనా పని ఉందా చూసుకున్నాను.

కానీ ఇంతలోనే మా ఆడపడుచు వాళ్ళ ఆటోలో దిగారు. వాళ్లకి అక్కడ ఏదో షాపింగ్ పని ఉంది అంటూ నన్ను వాళ్ళ వెనకే లేకపోయారు.

షాపింగ్ నుంచి వచ్చిన నాకు ఇద్దరు పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఇంటి అరుగు మీద కూర్చుని కనిపించడంతో పాపం అనిపించి చాలా సేపు అయిందా అంటూ వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకొని లోపలికి తీసుకువెళ్ళి ఇచ్చాను.

అమ్మ, నాన్న కూడా వచ్చారు కానీ ఇంటికి తాళం వేయడం చూసి బయటకు ఎక్కడికో వెళ్ళిపోయారు అన్నారు పిల్లలు ఇద్దరు. దాంతో గుండె గుభేలుమంది ఈరోజు నా పని అయిపోయినట్లే అనుకున్నాను.

ఇలా షాపింగ్ కి వెళ్లాను అని తెలిసి వాళ్ళ చెల్లి తో వెళ్ళినా సరే నా వీపు విమానం మోత మోగాల్సిందే ఇక ఆరోజు నా పని అయినట్లే అనుకుంటూ భయపడుతూ ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను పిల్లలకి అన్నం పెట్టి వచ్చాను.

అనుకున్నట్టే ఆయన తాగి ఇంటికి వచ్చారు రావడం ఆలస్యం తన ప్యాంటుకి ఉన్న బెల్ట్ ను తీసి నా వీపు విమానం మోత మోగించాడు. ఏమే నా చెల్లి అయినంతమాత్రాన నువ్వు దానితో బజార్ కి వెళ్తావా షాపింగ్ పేరుతో ఎవరినైనా చూసి వచ్చావా?

సిగ్గు లేదు నేను రానని చెప్పలేవు అంటూ ఆయన నా ఒంటి మీద పడుతున్న దెబ్బలకు సమాధానంగా నేను నేను రాను అని చెప్తే మళ్ళీ మీరు ఎందుకు వెళ్ళలేదు అంటూ కొడతారు అంటూ ఎదురు సమాధానం చెప్పే సరికి దానికి ఇంకో నాలుగు దెబ్బలు ఎక్కువ పడ్డాయి.

నాకు ఎదురు సమాధానం చెప్తావా ఇంకోసారి తాట తీస్తా జాగ్రత్త అంటూ కొట్టి కొట్టి ఆ తర్వాత నన్ను ఆక్రమించుకున్నాడు.. తన కోరిక తీరిన తర్వాత గుర్రు కొట్టి ఆదమరచి నిద్రపోతున్న అతన్ని చూస్తూ నేను మెల్లగా లేచి టేబుల్ దగ్గరికి నడిచాను.

అక్కడ ఉన్న నా డైరీ తీసుకుని పేజీలు తిప్పుతూ అలాగే కూర్చున్నాను. ఏ పేజీలో చూసినా నేను లేను అంతా ఇంటి పనులతోనూ ఆయన దెబ్బలతో నిండిపోయింది. నా బ్రతుకింతే అనుకుంటూ తిరిగి లేచి పనుల్లో పడిపోయాను.

కాలం గడిచిపోయింది. రంగు పెట్టె చివర్లో ఉన్న ఆ డైరీ చదివిన కుందన కళ్ళు వశించ సాగాయి. బామ్మ ఎన్ని బాధలను అనుభవించి ఇప్పటికి కూడా చిరునవ్వుతో ఎలా ఉండగలుగుతుంది అనుకుంది మనసులో.

ఆమె ఇన్ని సమస్యలను అధిగమించి కూడా ఇప్పుడు తానే పదిమందికి దారి చూపుతూ వృద్ధుల ఆశ్రమం నడిపించడం అనేది చిన్న విషయం కాదు ఎంతో పట్టుదల ఉంటే తప్ప అది ఎవరు చేయలేరు.

ఏం మా కుందన ఏం చేస్తున్నావ్ అంటూ వచ్చింది ప్రియంవద. బామ్మ నువ్వు ఎంత గొప్ప దానివి అంటున్న మనవరాల్ని చూసి ఓ నాడైరీ చదివావా ఇతరుల చదవకూడదని తెలియదా అంటూ చిన్నగా మొట్టికాయ వేసింది నవ్వుతూ.

చదవచ్చు బామ్మ ఏం పర్లేదు ఎందుకంటే నీ డైరీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఇన్ని మాటలు విని చిత్రహింసలు పడిన నువ్వు ఇప్పుడు ఇంత మందికి ఆదర్శంగా నిలిచావు అంటే నువ్వు ఎంత గొప్ప దానివో అర్ధం అయ్యింది.

ఇన్ని రోజులు నిన్ను ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడు నా కళ్ళు తెరిపించారవు ఇప్పటినుంచి నేను కూడా డైరీ రాయడం మొదలు పెడతాను అంది కుందన ప్రియంవద భుజాలపై తల వాల్చి…..

– భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *