గమనం
నవనవలాడే….. సూర్యోదయ కిరణాల తాకిడికి…
విరజిమ్మిన నరజన్మకు నవనాడులు కదలాడగా…
మరుభూమికి నవోదయ కాంతులు వెదజల్లగా…
ప్రకృతి అందాలు అలవోకగా అలలారగా…
మనసు పొరల్లో మమతానురాగాలు ఉదయించగా..
నీలి ఆకాశమంత తేలి నేలపై వాలి తొంగి చూడగా…
వంగిన ఆకాశానికి వందనాలు చేసి మరీ మరీ ముద్దాడగా…
పొంగిన ఆకాశగంగ జలజలా నేలపై జారి నదులుగా పారగా..
కాలలన్ని అనుకూలలై అన్ని ఋతువులు జీవన గమనానికి బాటగా బాసటగా…
– పలుకూరి