కాంతి తో శాంతి
బంగారు కొండ పై
ఆదిత్యుని సాక్షి గా
ఎదురు లేని ఉదయం
ఉషా కిరణాల వెల్లువ లో
“చేలాని” కి సంధ్య కనిపిస్తే
శ్రీ శ్రీ ఆమె ఎవరని వెతికి
లాభం లేదని పదండీ ముందుకు… ముందుకు..
నవతరం అంతటి తో ఆగలే
చీకటి లోయలో లోతు లెందుకు
విశ్వ విజయమే
యువత శ్వాసల్లో
దద్దరిల్లే శాంతి కోసం
దేవుడితో ముఖాముఖిగా
మానవుడి ప్రార్థన
అమాయక భూమి బిడ్డల
శాంతి కోసం….
శాంతి కోసం….
– అల్లావుద్దీన్