అందనిది!!
అమోఘము
నీ అందము.
అందనిది అందునా….!
అందాలన ఉన్న,
ఓ, అందమా………….!
ఇది, నా తొలి చూపు
పశ్చాత్తాపము………..!
అందనిది, ప్రియంబవున.
అది నువ్వే నాకు………!
గెంతులేస్తిని
నిను చేర……………..!
దూరము మూసిన
ద్వారము ఆయే…..!
నా చెర రానిది
చరమ దశకు.
నీది బాహ్య అందమే….!
లోన వికారమే………..!
అంబరాన ఉన్న అందమా…!
కారు మబ్బులు కమ్మెను నిన్ను.
నీ, నిజరూపము
నిశ్చయ మాయెను.
నా చర చేరెనిట్లు
చరమ దశకు.
అందనిది ప్రియంబవును.
ఇది నాకిష్టమే, ప్రియా……..!
– వాసు