రిషి కపూర్ చివరి సినిమా శర్మ జీ కా నమ్ కీన్ రివ్యూ!!!

రిషి కపూర్ చివరి సినిమా శర్మ జీ కా నమ్ కీన్ రివ్యూ!!!

రిషి కపూర్ చివరి సినిమా శర్మ జీ కా నమ్ కీన్ రివ్యూ!!!

చివరి క్షణం వరకూ నటనే శ్వాసగా జీవించిన గొప్ప నటుడు!!! రిషి కపూర్ చివరి సినిమా శర్మ జీ కా నమ్ కీన్ రివ్యూ!!!

రిషి కపూర్ బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న అలనాటి మేటి నటుడు రాజ్ కపూర్ వారసుడు… క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఏప్రిల్ 30, 2020లో ఆయన మరణించారు.

అయితే ఆయన నటించిన చివరి హిందీ చిత్రం శర్మ జీ కి నమ్ కీన్ 31 మార్చి న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. రాజ్ కపూర్ వారసుడిగా బాల్య నటుడిగా తన సినీ ప్రయాణం మొదలు పెట్టిన రిషి కపూర్ ఆయన కెరీర్లో దాదాపు కొన్ని వందల చిత్రాల్లో నటించారు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా గెలుచుకున్నారు.

అతని కుమారుడు రన్ బీర్ కపూర్ బాలీవుడ్లో మంచి నటుడిగా కొనసాగుతున్నాడు. ఇండియన్ సినిమా రిషి కపూర్ రూపంలో ఒక మంచి నటుడిని కోల్పోయింది అన్నది మాత్రం వాస్తవం. ఇక ఆయన నటించిన చివరి సినిమా ఎలా ఉందో మనం ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.

కథ : బ్రిజ్ గోపాల్ శర్మ (రిషి కపూర్) ఢిల్లీలో ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. భార్య చనిపోవడంతో తన ఇద్దరు మగ పిల్లలను అతనే చూసుకుంటూ ఉంటాడు. పెద్ద కొడుకు ఒక కార్పొరేట్ ఆఫీసులో పని చేస్తూ తన కొలీగ్ అయిన ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు ఇక చిన్న కొడుకు బీకాం చదువుతూ డాన్స్ మీద ఇంట్రెస్ట్ తో ఉంటాడు. ఒక మిక్సర్లు తయారుచేసే కంపెనీలో పనిచేసి రిటైర్ అయిన శర్మ ఇంట్లో ఖాళీగా కూర్చో కుండా ఏదో ఒక పని చేయాలనుకోవడం ఆ ప్రాసెస్ లో తనకు బాగా ఇష్టమైన వంట చేయడం అలా కొంత మంది రిచ్ లేడీస్ ఇళ్లకు వెళ్ళి వాళ్ళ కిట్టీ పార్టీ లకు కుకింగ్ చేయడం లాంటివి చేస్తుంటాడు కానీ ఇంట్లో కొడుకులకు చెప్పకపోవడం కానీ ఒక రోజు వాళ్లకు తెలిసిపోవడం ఆ తర్వాత ఏం జరిగింది అన్నది కథ.

 

 

విశ్లేషణ : నిజానికి ఇది పెద్ద కథేమీ కాదు కెరీర్లో రిటైర్ అయిపోయిన ఓ పెద్దాయన ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా వేరే వాళ్ల ఇళ్లకు వెళ్లి కుకింగ్ చేయడం లేట్ గా అయిన జీవితంలో తన ప్యాషన్ కోసం పని చేయాలనుకోవడం అనే పాయింట్ మీద కథ నడిపారు.

ఇందులో పెద్ద ట్విస్టులు కూడా ఏమీ ఉండవు సినిమా అలా సరదా సరదాగా సాగిపోతూ ఉంటుంది. అయితే శర్మ అనే పాత్రలో రిషి కపూర్ నటన మాత్రం మన గుండెల్ని తాకుతుంది జీవితంలో ఆఖరి క్షణం దాకా కూడా నటిస్తూ కన్నుమూసిన గొప్ప వ్యక్తి రిషి కపూర్.

 

 

ఏ నటుడికి అయినా కూడా కెరీర్ ఎండింగ్ అనేది చాలా ముఖ్యం తన కెరీర్ ని ఎలా ముగిస్తున్నారు అన్నది వాళ్లకి చాలా సంతృప్తినిస్తుంది ఆ విధంగా చెప్పుకుంటే రిషి కపూర్ తన చనిపోవడానికి కొన్ని రోజుల ముందు వరకు కూడా కెమెరా ముందు ఒక నటుడిగా నిలబడ్డారు ఇది నిజంగా ఆయన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన విషయమే.

ఇక సినిమాలో ఒక తండ్రి పాత్రలో ఆయన ఎన్నో భావోద్వేగాలను తనదైన శైలిలో రక్తి కట్టించారు అటు కామెడీ పండిస్తూనే ఇటు ఎమోషనల్ సీన్స్ లో కూడా మన చేత కన్నీళ్లు పెట్టిస్తారు అందులోనూ ఆయన చనిపోయిన తరువాత మనం చూస్తున్న సినిమా కాబట్టి సహజంగానే ఇంకొంచం ఎక్కువ ఎమోషనల్ గా ఫీల్ అవుతాము.

అయితే ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే రిషీకపూర్ చనిపోవడంతో సినిమాను ఎలా పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు రిషీకపూర్ కొడుకు అయిన హీరో రణబీర్ కపూర్ కూడా చాలా ఆలోచించారట. ఒక సమయంలో గ్రాఫిక్స్ చేద్దామా లేదా రణబీర్ కపూర్ తన తండ్రి రిషి కపూర్ లాగా ప్రోస్త టిక్ మేకప్ వేసుకొని నటించాలా అని కూడా ప్రయత్నాలు చేశారట కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు.

కానీ అంత గొప్ప నటుడి చివరి చిత్రాన్ని అలా వదిలేయకుండా ఎలాగైనా పూర్తి చేయాలి అన్న సంకల్పంతో వాళ్లు ప్రయత్నాలు చేసినప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ముందుకు వచ్చి అద్భుతమైన రీతిలో సినిమాలో రిషి కపూర్ నటించాల్సిన మిగతా సీన్స్ లో నటించి ఈ సినిమాని నిజంగానే రిషి కపూర్ పూర్తి చేసి వెళ్లారు అనే ఫీలింగ్ మనకు కలిగించారు.

సినిమాలో అప్పటికే రిషి కపూర్ తో షూట్ చేసిన సీన్స్ కు అలాగే ఇక మిగిలిపోయిన సీన్స్ ను పరేష్ రావల్ తో షూట్ చేసి ఒక సీన్ బిగినింగ్ లో పరేష్ రావల్ ని చూపిస్తే సీన్ ఎండింగ్ కు వచ్చేసరికి రిషి కపూర్ ను చూపించడం లేదా సీన్ మొదట్లో రిషి కపూర్ ను చూపించడం ఎండింగ్ పరేష్ రావల్ తో చేయడం అన్నది ఈ సినిమాలో నిజంగా అద్భుతంగా కుదిరింది.

ఇలా ఒక నటుడు చనిపోతే ఆ నటుడి ప్లేస్ లో మరొక నటుడిని పెట్టి సినిమాలు చేయడం అన్నది ఇంతవరకు కొన్నిసార్లు మాత్రమే జరిగింది అయితే ఈ సినిమాలో మాత్రం అది ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడం నిజంగా దర్శక నిర్మాతల పట్టుదలకి అలాగే రిషి కపూర్ కొడుకు రణబీర్ కపూర్ కి తన తండ్రి మీద ఉన్న ప్రేమను చూపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత గొప్ప నటుడికి ఒక నివాళిగా ఈ చిత్రాన్ని ఇవ్వాలన్న తలంపుతోనే వాళ్లు ఈ విధంగా సినిమాను పూర్తి చేయడం జరిగింది.

ఇక సినిమాలో మిగతా పాత్రల్లో నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి జుహీ చావ్లా అలాగే రిషి కపూర్ స్నేహితులుగా, కిట్టి పార్టీ లో ఉండే లేడీస్ గా కనిపించిన మిగతా నటీనటులు అందరు కూడా తమ పాత్రల్లో బాగానే నటించారు.

కెమెరా పనితనం, ఆర్ట్ డైరెక్షన్ ను కూడా సినిమాకు అందాన్ని తెచ్చి పెట్టింది.సినిమాలో ఉన్న పాటలు అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా మూడ్ కు తగ్గట్లుగానే ఉంది. దర్శకత్వం, సంభాషణలు కూడా చాలా సహజంగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి.

సినిమా కొంచెం నిదానంగా సాగినప్పటికీ కూడా రిషి కపూర్ లాంటి గొప్ప నటుడి చివరి చిత్రాన్ని చూస్తున్నామన్న ఒక చిన్న బరువైన ఫీలింగ్ మనల్ని సినిమాలో ఉన్న నెగిటివ్ లను మనం పెద్దగా పట్టించుకునేలా చేయదు.

చివరగా రిషి కపూర్ బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ హీరోగా 1970, 80 లలో ఒక వెలుగు వెలిగారు రాజ్ కపూర్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినా కూడా ఆ తర్వాత బాలీవుడ్ మీద తనదైన ముద్ర వేయగలిగారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నీతూ సింగ్ ను పెళ్లి చేసుకున్న ఆయనకు కొడుకు రణ బీర్ కపూర్ కూతురు రిద్ధిమ కపూర్ ఉన్నారు.

తన కొడుకు రణబీర్ కపూర్ పెళ్లి చూడాలి అన్న కోరిక తీరకుండానే రిషి కపూర్ చనిపోవడం వాళ్ల కుటుంబానికి తీరని లోటుగా చెప్పుకోవచ్చు. ఎలాంటి వివాదాలకు పోకుండా అలాగే ఎలాంటి కాంట్రవర్సీలలో ఇరుక్కోకుండా రిషి కపూర్ తన జీవితాంతం ఒక పీస్ ఫుల్ లైఫ్ గడిపారు అని చెప్పవచ్చు.

ఆయన కొడుకు రణ బీర్ కపూర్ చాలా ముభావంగా ఉండే పెద్దగా ఎవరితో కలవని వ్యక్తి కానీ రిషి కపూర్ అందుకు పూర్తిగా విరుద్ధం ఎప్పుడూ నలుగురితో మాట్లాడుతూ నలుగురిని నవ్విస్తూ చాలా సరదాగా ఉండే మనిషి అలాంటి మంచి నటున్ని నిజంగా ఇండియన్ సినిమా కోల్పోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్ 3.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *