చేదు

చేదు

నరేందర్ కథ గుర్తుందా అదే అండి మొన్న షుగర్ అని తెలిసిన నరేందర్. ఇప్పుడు అతను ఎట్లాంటి పాట్లు పడుతున్నాడు చూద్దాం …

ఏమండీ లేవండి అంటూ లత నిద్ర లేపే వరకు మెలకువ రాలేదు నరేందర్ కు. ఆకలితో నకనకలాడుతు యెప్పుడూ నిద్ర పట్టిందో గానీ ఇప్పుడు లేచేసరికి సమయం పది దాటింది.

అమ్మో నా ఆఫీసు అంటూ గబుక్కున లేవబోయాను అతన్ని అపుతూ లత, మీ ఆఫీసర్ గారు రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రమ్మన్నారు గానీ ముందు బ్రెష్ చేసి రండి అంటూ బాత్రూం లొకి నెట్టింది.

సరే సరే వెళ్తున్న అంటూ ఫ్రెష్ అయ్యి వచ్చి టేబుల్ ముందు కూర్చున్న నరేందర్ ముందు లత రెండు గ్లాస్ లు పెట్టింది.

అవి చూసి అందులో ఉన్న ద్రవాన్ని చూస్తూ ఎంటే ఇది హాయిగా ఏ అట్టో తేకుండా ఇవేంటి అన్నాడు బిత్తర పోయి.

ఇదిగో చూడండి ఇప్పటి నుండి నేను చెప్పినట్టు వినాలి మీరు అంతే లేదంటే నేను మా పుట్టింటికి పోతాను అంటూ బెదిరించే సరికి సర్లే ముందు ఇవెంటో చెప్పి తగలడు అన్నాడు కోపంగా…

చెప్తున్నా ఆగండి అంటూ ఇదిగో ఇది వేపాకు రసం, ఇదేమో మెంతుల రసం, ఇవి రెండు తాగిన తర్వాత మికింకోటి ఇస్తా అంది.

ఏంటి వేపాకు రసం మెంతి రసం తాగాలా నేనసలు తాగాను నాకు అట్లు కావాలి అన్నాడు కోపంగా అవన్నీ లేవు నేను పోతున్నా అంటూ బ్యాగ్ అందుకుంది.

బ్యాగ్ తో సహా రెఢీ ఉందంటే ఇది చాలా ప్లాన్ తో ఉందని అర్దం అయినా నరేందర్ సర్లే తాగుతాను కనీసం లంచ్ లోకి అయినా మంచి కూర పప్పు అవకాయ రోటి పచ్చడి చేయవే అంటూ బతిలాడదు. ముందు ఇవి కానీయండి అంటూ గ్లాస్ చేతికి ఇచ్చింది లత.

వెగటుగా అనిపించినా కళ్ళు, ముక్కు మూసుకుని గడగడా తాగాడు నరేందర్. గ్లాస్ కింద పెట్టడం ఆలస్యం ఇంకో గ్లాస్ చేతికి ఇవ్వగానే అది కూడా తాగేశాడు. ఇక మీరు రెస్ట్ తీసుకోండి అంటూ వంటింటి లోకి వెళ్ళింది లత.

ఎలాగూ సెలవు దొరికిందని పిల్లలతో కాసేపు ఫోన్ లో మాట్లాడాలని అనుకుంటే వాళ్లు తన షుగర్ గురించి తెలిసి జాగ్రత్తలు చెప్పడం మొదలు పెట్టేసరికి చిరాగ్గా అనిపించింది.

అందుకే ఫోన్ కట్టేసీ టీవీ పెట్టాడు అందులోనూ షుగర్ గురించే రావడంతో చిరాగ్గా అనిపించింది. ఇవన్నీ చేస్తూనే వంటింటి వైపు ఓ కన్ను వేసి ఉంచాడు ఘుమఘుమలు ఏమైనా వస్తాయేమో అని.

అహా రావడం లేదే, ఏమయ్యింటుంది అనుకుంటూ ఆలోచిస్తూ అసలు మా వంశంలో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉందా అని ఆలోచించడం మొదలు పెట్టాడు.

చాలా సేపటి తర్వాత అసలు ఎవరికీ లేదని గుర్తొచ్చింది నరేందర్ కి. ఈ లోపు లత ఏమండీ భోజనానికి రండి అంటూ పిలిచింది.

సరే కనీసం కడుపునిండా అన్నం అయినా తిందాం అని టేబుల్ దగ్గరికి వచ్చాడు. లత అతని ముందు ప్లేట్ పెట్టీ గిన్నెలు తీసి రెండు కీరా ముక్కలు, రెండు క్యారెట్ ముక్కలు, రెండు టమాటా ముక్కలు, రెండు ముల్లంగి ముక్కలు పెట్టీ తినండి అంది.

అవి చూసి నరేందర్ ఏమిటే ఈ చేదు తిండి పొద్దున్నే బేకకులు తినిపించావా ఇప్పుడేమో ఇవి అసలు నేను బ్రతకాలా వద్దా అంటూ కోపంగా లేవబోయాడు.

లత వెంటనే పక్కనే ఉన్న బ్యాగ్ చూపిస్తూ తింటారా లేదా అనగానే ఇంకేం మాట్లాడకుండా గబగబా నోట్లో కుక్కుకున్నాడు కిక్కురుమనకుండా…

అది మొదలు ప్రతిరోజూ వేపాకు, మెంతుల కషాయం, కీరా, ముల్లంగి ముక్కలు తింటూ గడుపుతున్నాడు నరేందర్ చేదు మాత్రలు మింగినట్టు మింగుతున్నాడు.

మరి ఇంతకీ నరేందర్ మళ్లీ తన కోరికలు ఎలా తీర్చుకున్నాడు అనేది రేపటి భాగం లో చదవండి..

– భవ్యాచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *