తీయని చేదు రాత్రులు!!
రాత్రిళ్లను వెళ్ళ దీయ
జారుకుంటిని నిద్రలోకి.
చీమ చేసిన చప్పుళ్ళు
ఘీంకారల మాదిరి
వినవొచ్చెనే ……..!
దోమలు,
యుద్ధ విమానాలై
కఠోర చడులు చేసెనే.
నల్లుల నృత్యాల
పాద హేల
ఈలల సవ్వడై
చెవుల చేరెనే.
విచ్చిన పరుపు నుంచి
వచ్చిన దూది బంతుల
బరువైన బాణీలు భారమయ్యెనే !
పరుగు లేని నా పంక
కుహూ, కుహూ అంటూ
కోకిలలా నా గదిని చుట్టెనే.
కలలో నిన్ను
చూడాలనే నా తపన
నన్ను చేసెనే
సహనశీలిగ నిట్లు.
– వాసు