చిక్కదనాల చిలిపితనం
బాల్యంలో చిలిపిదనం
బహుముచ్చట అందరికీ
చిరునవ్వు కళ్ళతో
అడుగేసే బుడతడు
ఎవరికీ చిక్కడు..ఎంతకీ అందడు..
చిలిపి గోపయ్య వేణుగానమై
కౌమారం పిలుపుతో
సిగ్గుపడే యువత
ఇంటికే అందం
పలుకే మకరందం
చిలిపి ఊహల ఊయలలో
ఊగేను ప్రాయం
నడివయసు గాంభీర్యం
దాచేను చిలిపిదనం
ఏకాంతాల చిలిపిదనం
పూచిన గోరింటలా
గోరువంకల జంట
గ్రోల అనుభూతుల గోరుముద్దలు
మునిమాపువేళలో
చిలిపి జ్ఞాపకాల జ్వరం
అది మనసుకేమొ వరం
అమ్మమ్మ తాతయ్యల
ముసిముసి నవ్వులు తెరిచునుగా
చిలిపి వలపు తలుపులు
– సి.యస్.రాంబాబు